Eye inflammation: కళ్లలో మంట, దురదగా ఉందా?.. అస్సలు ఆలస్యం చేయొద్దు

దుమ్ము, బాక్టీరియా, అలెర్జీలు, కాంటాక్ట్ లెన్స్‌లు లాంటివి కళ్లలో చికాకు, దురదకు కారణం అవుతాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అప్పటికీ కళ్లకు ఉపశమనం కలగకపోతే కచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి.

New Update
Eye inflammation: కళ్లలో మంట, దురదగా ఉందా?.. అస్సలు ఆలస్యం చేయొద్దు

Eye inflammation: ఈ రోజుల్లో చాలా మంది కళ్లలో చికాకు, దురదతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య సర్వసాధారణంగా మారింది. కానీ చాలా మంది దీనిని తేలికగా తీసుకుంటారు. కళ్లలో మంట, దురద వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవడం ముఖ్యం. లేకుంటే కంటి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.

దురద కారణాలు:

  • దుమ్ము, బాక్టీరియా, అలెర్జీలు, కాంటాక్ట్ లెన్స్‌లు వంటివి కళ్లలో చికాకు, దురదకు కారణం అవుతాయి. కళ్లు ఎర్రబడటానికి ప్రధాన కారణాలలో ఒకటి అలెర్జీ కావచ్చు. ఇది కళ్లలో మంట, దురదను కలిగిస్తుంది. అంతేకాకుండా దుమ్ము, పొగ వల్ల కూడా కళ్లు ఎర్రగా మారుతాయి.

స్క్రీన్‌లను చూడటం తగ్గించాలి:

  • చాలా మందికి రాత్రి వరకు మొబైల్ ఫోన్లు వాడుతుంటారు. దీనివల్ల కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువసేపు కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్ ముందు కూర్చోవడం లేదా రాత్రిపూట మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల కూడా కళ్లు పొడిబారుతాయి. దీంతో కళ్లలో చికాకు వస్తుంది. కొన్నిసార్లు బ్యాక్టీరియా, వైరస్‌లు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.

నివారణా మార్గాలు:

  • కంటి చికాకు, దురదను నివారించడానికి కళ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఎక్కువసేపు కళ్లలో మంట, దురద ఉంటే చల్లటి నీటితో కడుక్కోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని డాక్టర్లు అంటున్నారు. సూర్యకాంతి, స్క్రీన్‌లకు దూరంగా ఉండాలి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అప్పటికీ కళ్లకు ఉపశమనం కలగకపోతే కచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి.

ఇది కూడా చదవండి: ఈ ఫుడ్‌ తింటే బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ పోతాయి.. హార్వర్డ్ రిపోర్ట్!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు