కియా కార్ పై అదిరిపోయే బంపర్ ఆఫర్!

కియా కంపెనీ కార్లు భారతీయ మార్కెట్ లోకి వచ్చి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. SUVలలోని సెల్టోస్ కారు పై రూ.60 వేలు తగ్గిస్తున్నట్టు కెంపనీ తెలిపింది. కియా కంపెనీ నుంచి విడుదలైన SUVలలో సెల్టోస్ కారు భారత్ లో సూపర్ సక్సెస్ అయింది.

New Update
కియా కార్ పై అదిరిపోయే బంపర్ ఆఫర్!

కియా కంపెనీ కార్లు భారతీయ మార్కెట్ లోకి వచ్చి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వీటిపై పై అదిరిపోయే  ఆఫర్లను ఆ కంపెనీ ప్రకటించింది. SUVలలోని సెల్టోస్ కారు పై రూ.60 వేల తగ్గిస్తున్నట్టు కెంపనీ తెలిపింది. కియా కంపెనీ నుంచి విడుదలైన SUVలలో సెల్టోస్ కారు భారత్ మార్కెట్లో సూపర్ సక్సెస్ అయింది.

కియా 2019లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. సోనెట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీతో పాటు క్రాస్ ఓవర్ వంటి ఇతర మోడల్స్ కూడా పరిచయం చేసి సక్సెస్ సాధించింది. కియా కంపెనీ ఈవీ కార్లకు కూడా మన దేశంలో మంచి డిమాండ్ ఉంది.టెక్ లైన్, జీటీ లైన్, ఎక్స్ లైన్ అనే మూడు రకాల వేరియంట్లలో ఈ కియా సెల్టోస్ కార్లు అందుబాటులో ఉండగా.. వీటి ధరల శ్రేణి చూస్తే రూ. 10.90 లక్షల నుంచి రూ. 20.37 లక్షల వరకు ఉన్నాయి. ఇకపోతే ఈ నెలలో కియా కంపెనీ ‘ఎక్స్‌చేంజ్ యువర్ కార్’ అనే అవకాశం కల్పించింది. కొత్త కియా కస్టమర్లు ఈ ఆన్‌లైన్ ఛానెల్‌ని ఉపయోగించి తాము ఇప్పటికే వినియోగిస్తున్న పాత కార్ల విలువను అంచనా వేసుకునే అవకాశం దక్కింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు