/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/KCR-BULLETS-jpg.webp)
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుస పర్యటనలతో దూసుకుపోతున్నారు గులాబీ బాస్ సీఎం కేసీఆర్ (CM KCR). ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ ప్రసంగంలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. అస్లాం అనే వ్యక్తి సభ ప్రాంగణంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నాడు. ఇది గమనించిన పోలీస్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అస్లాం కర్ణాటకకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.