Modi Speech: వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టం.. మోదీ లాస్ట్ స్పీచ్!

వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టమన్నారు మోదీ. లోక్‌సభ వేదికగా ప్రతిపక్షాలపై నిప్పులుచెరిగారు. నేతల పిల్లలు రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని.. అయితే వాళ్లే మొత్తంగా పార్టీని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదన్నారు. తాను, రాజ్‌నాథ్‌ వారసత్వ రాజకీయాలు చేయలేదన్నారు.

New Update
Modi Speech: వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టం.. మోదీ లాస్ట్ స్పీచ్!

PM Modi In Loksabha: లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై మోదీ సమాధానం ఇచ్చారు. సెంగోల్‌ని గుర్తుచేసుకోవడం ద్వారా ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సెంగోల్ పార్లమెంటుకు గర్వకారణమన్నారు. ప్రతిభావంతులైన వ్యక్తులు రాజకీయాల్లోకి రావడానికి వ్యతిరేకం కాదుని చెప్పుకొచ్చిన ప్రధాని.. వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టమన్నారు.

మోదీ ఏం అన్నారంటే?

--> కొంతమంది పోటీ చేసే స్థానాలను మార్చుకున్నారు.

--> బీజేపీపై పోటీకి విపక్షాలు వణికిపోతున్నాయి.

--> ఎన్నికల తర్వాత విపక్షాలు ప్రేక్షకుల సీట్లకు పరిమితమౌతారు.

-->రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని సమాధానం.

-->75వ రిపబ్లిక్ డేను ఘనంగా జరుపుకున్నాం.

--> సభకు సెంగోల్ తీసుకొచ్చి కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చాం.

--> వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టం.

--> నేతల పిల్లలు రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు.

--> కానీ వాళ్లే పార్టీని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదు.

--> నేను, రాజ్‌నాథ్‌ వారసత్వ రాజకీయాలు చేయలేదు.

--> నిర్ణయాలన్ని ఒకే కుటుంబం తీసుకోవడం కుటుంబపాలన అవుతుంది.

--> ఖర్గే లోక్‌సభ నుంచి రాజ్యసభకు మారారు.

--> గులాంనబీ ఆజాద్‌ పార్టీ నుంచే షిఫ్ట్ అయిపోయారు.

--> కాంగ్రెస్‌ నేతలు కొందరు కొత్త దుకాణాలు తెరుస్తున్నారు.

--> వాళ్ల దుకాణాలు త్వరలోనే మూతపడతాయి.

--> రాహుల్‌ మొహబత్‌ కీ దుకాన్‌పై మోదీ సెటైర్లు.

--> మీ దుకాణం ఒక్క నాయకుడి కోసం మాత్రమే.

--> కాంగ్రెస్‌ ఒకే ప్రొడక్ట్‌ను మాటిమాటికీ లాంచ్ చేస్తోంది.

-->ప్రతిపక్షాలు దేశాన్ని విభజిస్తున్నాయి.

ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకొచ్చాం:
2014లో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 5వ స్థానానికి వచ్చిందన్నారు మోదీ. ఎవరేమన్నా బీజేపీ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమన్నారు. మూ మూడో టర్మ్‌లో భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజలు బుద్ధి చెప్పినా ప్రతిపక్షాల తీరు మారడం లేదన్నారు మోదీ. ప్రతిపక్షలా ఆలోచన తీరును దేశం గమనిస్తుందని.. తొలి విపక్షలను కాంగ్రెస్‌ ఎదగనివ్వదన్నారు మోదీ.

Also Read: కేసీఆర్ జోలికొస్తే చెప్పుతో కొడతా.. బాల్క సుమన్ షాకింగ్ కామెంట్స్..!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు