Budget Halwa Ceremony: బడ్జెట్ కోసం హల్వా వేడుక.. అసలు బడ్జెట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే.. 

బడ్జెట్ 2024 కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ కు ముందు ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులకు హల్వా వేడుక నిర్వహించారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా అందరికీ పంపిణీ చేయడంతో బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ ప్రారంభం అయింది. 

Budget Halwa Ceremony: బడ్జెట్ కోసం హల్వా వేడుక.. అసలు బడ్జెట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే.. 
New Update

Budget Halwa Ceremony: కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024-25 ఫిబ్రవరి 1న సమర్పించబడుతుంది. దీని సన్నాహాలు పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రం (జనవరి 24) బడ్జెట్ సంబంధిత డాక్యుమెంట్స్ ప్రింటింగ్  ప్రారంభంతో సాంప్రదాయ హల్వా వేడుకను జరుపుకున్నారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ వేడుక జరిగింది. ఇక్కడ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) హల్వా ఉన్న పెద్ద ఇనుప పాన్‌ను ఓపెన్ చేశారు. తరువాత అందులోని హల్వాను(Budget Halwa Ceremony) మంత్రిత్వ శాఖ అధికారులకు ఆర్థిక మంత్రి వడ్డించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్, పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హల్వా వేడుక అంటే ఏమిటి?
బడ్జెట్ ఖరారు కాకముందే ఆర్థిక శాఖలో హల్వా తయారు చేస్తారు. బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ మొదలు పెట్టే రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఆచారం చాలా కాలంగా కొనసాగుతోంది. మన దేశంలో స్వీట్లతో శుభ కార్యాలు ప్రారంభించడం అనే సంప్రదాయానికి ఈ హల్వా వేడుక(Budget Halwa Ceremony) ప్రతీకగా నిలుస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021 మరియు 2022 సంవత్సరాల్లో ఈ ఆచారం నిర్వహించలేదు. బదులుగా, కోర్ ఉద్యోగులకు కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించి స్వీట్లు అందించారు. బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాలుపంచుకున్న ఉద్యోగులు, ఒక విధంగా గృహనిర్బంధంలో ఉంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను (Budget 2024) ప్రవేశపెట్టిన తర్వాతే ఈ అధికారులు, ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో టచ్‌లోకి వస్తారు.  బడ్జెట్‌ను రహస్యంగా ఉంచడం కోసమే ఇలా చేస్తారు. 

బడ్జెట్ అంటే ఏమిటి?
మన ఇంటిని నడపడానికి బడ్జెట్ ఎంత అవసరమో అలాగే దేశాన్ని నడపడానికి కూడా బడ్జెట్ కావాలి. మా ఇంటికి మనం పెట్టే బడ్జెట్ సాధారణంగా నెలకు ఉంటుంది. ఇందులో మనం ఈ నెలలో ఎంత ఖర్చు చేశామో, ఎంత సంపాదించామో లెక్కిస్తారు. దేశ బడ్జెట్ కూడా ఇదే పద్ధతిలో జరుగుతుంది. ఇది సంవత్సరపు ఖర్చులు- ఆదాయాల ఎకౌంట్స్ కలిగి ఉంటుంది.

Also Read: బంగారం కొనేవారికి మంచి అవకాశం.. నిలకడగా ధరలు 

బడ్జెట్ సిద్ధం చేసే  ప్రక్రియ ఇలా ఉంటుంది.. 

  1. ముందుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వయంప్రతిపత్త సంస్థలను కొత్త సంవత్సరానికి అంచనాలు వేయాలని కోరుతూ ఒక సర్క్యులర్‌ను జారీ చేస్తుంది. కొత్త సంవత్సరానికి సంబంధించి అంచనాలు ఇవ్వడంతో పాటు గతేడాది ఖర్చులు, ఆదాయ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
  2. అంచనాను స్వీకరించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు దానిని పరిశీలిస్తారు. దీనిపై సంబంధిత మంత్రిత్వ శాఖలు, వ్యయ శాఖ అధికారుల్లో లోతైన చర్చ సాగుతుంది. ఆపై డేటా సిఫార్సులతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తారు.
  3. ఆర్థిక మంత్రిత్వ శాఖ, అన్ని సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, వారి ఖర్చుల కోసం శాఖలకు ఆదాయాన్ని కేటాయిస్తుంది. రెవెన్యూ- ఆర్థిక వ్యవహారాల శాఖ పరిస్థితిపై లోతైన అవగాహన పొందడానికి రైతులు, చిన్న వ్యాపారవేత్తలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల ప్రతినిధులను సంప్రదిస్తుంది.
  4. ప్రీ-బడ్జెట్ సమావేశంలో, ఆర్థిక మంత్రి సంబంధిత పార్టీలతో వారి ప్రతిపాదనలు, డిమాండ్లను తెలుసుకుంటారు. వీరిలో రాష్ట్రాల ప్రతినిధులు, బ్యాంకర్లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు , ఉద్యోగుల సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ప్రీ-బడ్జెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆర్థిక మంత్రి అన్ని డిమాండ్లపై తుది నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ ఖరారు కాకముందే ఆర్థిక మంత్రి ప్రధానితో కూడా మాట్లాడతారు.
  5. బడ్జెట్ సమర్పణకు కొన్ని రోజుల ముందు హల్వా వేడుక జరుగుతుంది. పెద్ద పాన్‌లో తయారుచేసిన హల్వా ఆర్థిక మంత్రిత్వ శాఖ సిబ్బందికి పంపిణీ చేస్తారు. దీంతో బడ్జెట్ ముద్రణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, సహాయక సిబ్బంది బడ్జెట్‌ను సమర్పించే వరకు మంత్రిత్వ శాఖలోనే ఉంటారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ముద్రించకుండా సాఫ్ట్‌ కాపీలను పార్లమెంటు సభ్యులకు అందజేశారు.
  6. ఆర్థిక మంత్రి సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో (Lok Sabha) సమర్పిస్తారు. 2016 వరకు, ఇది ఫిబ్రవరి చివరి రోజున జరిగేది.  2017 నుండి, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 న బడ్జెట్ ప్రవేశపెట్టే విధానం  ప్రారంభమైంది. ఈ సంవత్సరం, మొదటిసారిగా, అన్ని బడ్జెట్ పత్రాలు యూనియన్ బడ్జెట్ మొబైల్‌ యాప్ లో అందుబాటులో కి తీసుకువచ్చారు. 

Watch this interesting Video:

#union-budget-2024 #finance-minister-nirmala-sitharaman #2024-budget-expectations
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe