Budget-Students: బడ్జెట్‌ లో విద్యార్థులకు తీపికబురు.. విద్యా రుణాలపై!

ఈ బడ్జెట్ లో విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉండే విషయాలు ప్రస్తావించారు నిర్మలా సీతారామన్. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు రుణాలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు.

New Update
Budget-Students: బడ్జెట్‌ లో విద్యార్థులకు తీపికబురు.. విద్యా రుణాలపై!

Budget-Students: యావత్‌ దేశం మొత్తం ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ని పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు. ఆమె 7వ సారి బడ్జెట్‌ను పార్లమెంట్‌ బడ్జెన్‌ ను చదివి వినిపిస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో మూడో సారి ప్రవేశపెడుతున్నందుకు గర్వపడుతున్నాని నిర్మలా సీతారామన్ వివరించారు.

ఈ బడ్జెట్ లో విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉండే విషయాలు ప్రస్తావించారు నిర్మలా సీతారామన్. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు రుణాలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు ఆర్థిక మంత్రి మంగళవారం ప్రకటించారు. 2024-25 బడ్జెట్ ప్రసంగంలో ఈ ప్రకటన చేశారు.

రుణ మొత్తంలో 3 శాతం వడ్డీ రాయితీతో ప్రతి సంవత్సరం 1 లక్ష మంది విద్యార్థులకు నేరుగా ఇ-ఓచర్లను అందజేస్తుందని సీతారామన్ తెలిపారు. అర్హత కలిగిన వారు ఈ ఎడ్యుకేషన్ లోన్స్ పొందొచ్చని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ సంవత్సరం రెండు బడ్జెట్లు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు. దీంతో ప్రభుత్వం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. నేడు ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ మోదీ 3.0లో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇదే అవుతుంది.

Also read: ఎంపీడీవో వెంకట రమణరావు మృతి..అధికారికంగా నిర్థారించిన పోలీసులు!

Advertisment
తాజా కథనాలు