Anand Mahindra: నేను ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నా..బడ్జెట్ చుట్టూ ఎంతో డ్రామా! వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నాను..బడ్జెట్ అంటే ఏదో ఊహించేసుకుని ఎంతో డ్రామా సృష్టిస్తున్నాం.అభివృద్ది కోసం చేసే ప్రకటనలకు కేవలం బడ్జెట్ ఒక్కటే సందర్భం కాదు అన్నారు. By Bhavana 02 Feb 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Anand Mahindra: నిత్యం సోషల్ మీడియాలో (Social Media) యాక్టివ్ గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) గురువారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ (Budget) గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యాలను చేశారు. ఈ క్రమంలో ఆయన అసలు బడ్జెట్ అంటే ఏంటి? దానిని ఏ దృష్టితో మనం చూడాలి? దీని వల్ల ఉపయోగాలు ఏంటి? అనే అంశాలను కూడా ఆనంద్ మహీంద్రా తన పోస్టులో చెప్పుకొచ్చారు. '' నేను ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నాను..బడ్జెట్ అంటే మనం ఏదో ఊహించేసుకుని ఎంతో డ్రామా (Drama) సృష్టిస్తున్నాం. దాని మీద ఎన్నో ఆశలు పెట్టేసుకొని కేంద్రం చేసే విధాన పరమైన ప్రకటనలకు అవాస్తవికతలను జోడించి అంచనాలను తారాస్థాయికి పెంచేస్తుంటాం. అభివృద్ది కోసం చేసే ప్రకటనలకు కేవలం బడ్జెట్ ఒక్కటే సందర్భం కాదు. సంవత్సరంలో ఎప్పుడైనా కానీ పరివర్తనాత్మక విధాన ప్రకటనలు చేయవచ్చు. For many years, I have been saying that we create too much drama around the budget and raise expectations of policy announcements to an unrealistically feverish pitch. The Budget is NOT necessarily the occasion for transformational policy announcements. Those can, and should,… pic.twitter.com/hfqxnw4IUa — anand mahindra (@anandmahindra) February 1, 2024 బడ్జెట్ అనేది కేవలం మన ఆర్థిక అవసరాలను వివేకంతో క్రమశిక్షణతో ఎలా ప్లాన్ చేసుకోవాలన్నదానికి బడ్జెట్ అనేది ఓ అవకాశం కల్పిస్తుంది అంతే . భవిష్యత్తు కోసం మనం పెట్టుబడులు పెట్టడానికి ఎంత ఎక్కువగా ప్లాన్ చేసుకుంటు ఉంటామో, ప్రపంచ పెట్టుబడిదారుల నుంచి కూడా అంతే విశ్వాసాన్ని బడ్జెట్ ద్వారా పొందుతామని'' మహీంద్రా చెప్పుకొచ్చారు. గురువారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ (Nirmala SitaRaman) ప్రవేశ పెట్టిన బడ్జెట్ తనకు ఎంతగానో సంతృప్తినిచ్చిందని ఆనంద్ మహీంద్రా తన పోస్టులో వివరించారు. బడ్జెట్ ప్రసంగం చాలా క్లుప్తంగా సాగింది. ఎంతో మెచ్చుకోదగిన విషయం. ఇది అంతా కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో కూడుకున్న ప్రసంగం అంటూ మహీంద్రా ప్రశంసించారు. ఎన్నికలు దగ్గరల్లో ఉన్నప్పటికీ కూడా వారు ప్రజలను ఆకట్టుకోవడానికి ఎలాంటి ఆకర్షణలను ఏర వేయలేదు. ఎన్నికల ముందు బడ్జెట్ అంటే మనం ఎంతో ఊహించుకుంటాం. కానీ ఈ బడ్జెట్ వాటికి అన్నింటికి ఎంతో భిన్నంగా ఉంది. దీనిని నేను మనఃస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను ..ఇక మీదట ఇదే ఒరవడి కొనసాగుతుందని ఆశిస్తున్నాను అంటూ మహీంద్రా చెప్పుకొచ్చారు. ఆర్థిక లోటు అంచనా వేసిన దానికంటే మంచిగానే ఉందని మనం భావించాలి. భారీగా పన్నులు, సుంకాల్లో ఎలాంటి మార్పులు లేవు. వ్యాపారాలు ఎప్పుడూ కూడా స్థిరత్వానికి , అంచనాలకు విలువను ఇస్తాయి. ఇది ఈ బడ్జెట్ లో ప్రతిఫలించింది. సుసంపన్న భారత్ ను సాకారం చేసే క్రమంలో ఈ సంతృప్తికర బడ్జెట్ సాయంతో ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రణాళికలను అందరూ కూడా సమర్థంగా అమలు చేసుకోవాలని మహీంద్రా తెలిపారు. Also read: ఆప్ నిరసన కార్యక్రమం… పోలీసుల చేతిలో ఢిల్లీ నగరం! #anand-mahindra #nirmala-sitaraman #budget #social-medi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి