Budda Venkanna: టీడీపీ నుంచి వెళ్లిన కుక్క కొడాలి నాని: బుద్దా వెంకన్న! ఏపీలో రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఒకవేళ అధినేత సీటు ఇవ్వకపోయినా ఆప్షన్ బి కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు కుటుంబం మీద ఈగని కూడా వాలనివ్వను అన్నారు. By Bhavana 10 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఏపీ (Ap) రాజకీయాలు (Politics) రోజురోజుకి హీటేక్కుతున్నాయి. ఎన్నికలు (Elections) సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీల నాయకులు తమ కసరత్తులు ఇప్పటికే మొదలు పెట్టేశారు. అధికార పార్టీ వైసీపీ (YCP) ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ యాత్ర.. ఈ యాత్ర అంటూ తెగ చేసేస్తుంది. ఈ క్రమంలోనే టీడీపీ (TDP) నేతలు మేమేమి తక్కువ కాదు అంటూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నేను రెడీగా ఉన్నానని తనకు అక్కడ నుంచే సీటు ఇవ్వాలని చంద్రబాబును (Chandrababu) అడుగుతానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న (Budda Venkanna) వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత బీసీలను ప్రోత్సాహించేందుకు అయినా నాకు సీటు ఇస్తారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఒకవేళ మా అధినేత నాకు సీటు ఇవ్వకపోయినా కూడా నాకంటూ ఆప్షన్ బి కూడా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ వైసీపీ మీద ఆయన విరుచుకుపడ్డారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని యువత అంతా కూడా వైసీపీకి పాడె కడదామని చూస్తుంటే..వీళ్లు ఆడదాం ఆంధ్రా అంటూ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేత కొడాలి నాని (Kodali nan) మూడు సంవత్సరాల క్రితమే ఆడుదాం ఆంధ్రా అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. క్యాసినో, ఆశ్లీల డ్యాన్సులు ఆడేందుకు ప్రభుత్వం అతనికి అనుమతిలిచ్చింది. కొడాలి నాని టీడీపీ నుంచి వెళ్లిన ఓ పిచ్చి కుక్క అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే బయటకు వెళ్లి వైసీపీలో చేరాడని తెలిపారు. కొడాలి నాని నాలుక ఎటు తిరిగితే అటు మాట్లాడతాడని అన్నారు. పిచ్చి కుక్కలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సీఎందే అని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లు కత్తులు, కర్రలు పడితే మేము కూడా అలాగే సమాధానం చెప్తామని తెలిపారు. సీబీఎన్ కి సత్తా ఉంది కాబట్టే ప్రధానులను కూడా తయారు చేసాడని అన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత చాలా మంది నాయకులు ఏపీని వదిలి పారిపోయేందుకు రెడీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వారిని లాక్కొచ్చి మరీ శిక్షిస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. తనకు సీటు ఇవ్వాలని చంద్రబాబును అడుగుతానని చెప్పారు. బీసీ అభ్యర్థిగా ఇక్కడ నాకు సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. అంతేకాదు ఒకవేళ ఇవ్వకపోయినా కూడా నాకు ఆప్షన్ బి ఉంది. చంద్రబాబు కుటుంబం మీద ఈగని కూడా వాలనిచ్చేది లేదని ఆయన అన్నారు. Also read: రాజస్థాన్ సీఎం ఎవరు..ఎటూ తేల్చుకోలేక తలలు పట్టుకున్న కమలనాథులు! #ycp #tdp #kodali-nani #budda-venkanna #elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి