Budda Venkanna: దమ్ముంటే పులివెందులలో రాజీనామా చేయి.. వైఎస్ జగన్‌కు బుద్ధా వెంకన్న సవాల్..! దమ్ముంటే జగన్ పులివెందులలో రాజీనామా చేయాలని సవాల్ విసిరారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికలకు వెళ్దామన్నారు. గత ఎన్నికల్లో జగన్‌కు 151 సీట్లు వస్తే అది విజయమా.. అదే తమకు 164 సీట్లు వస్తే ఈవీఎంలపై మాట్లాడతారా? అంటూ కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 18 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి EVM War in AP: 2024 ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ కేవలం 11 సీట్లతోనే సరిపెట్టుకుంది. అయితే, తాజాగా EVM మిషిన్లపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan).. ఈవీఎమ్‌లు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అంటూ సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేశారు. Just as justice should not only be served, but should also appear to have been served, so should democracy not only prevail but must appear to be prevalent undoubtedly. In electoral practices across the world in almost every advanced democracy, paper ballots are used, not EVMs.… — YS Jagan Mohan Reddy (@ysjagan) June 18, 2024 Also Read: దారుణం.. మొదటి భార్య కోసం రెండో భార్యను చంపిన భర్త.! అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ పేపర్ బ్యాలెట్లే (Ballot Papers) వాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్‌లో కూడా EVMలకు బదులుగా పేపర్ బ్యాలెట్లు వాడితే మంచిదని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ ట్వీట్‌పై తాజాగా, టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. జగన్ రెడ్డి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా..? అదే మాకు 164 సీట్లు వస్తె evm లు గురించి మాట్లాడుతున్నావు... ఒకపని చేద్దాం.. నువ్వు పులివెందులలో రాజీనామా చెయ్యి.. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నిక పెట్టమని అందరం కలిసి ఎలెక్షన్ కమిషన్ ను కొరదాం.. నీకు ఈసారి మొన్న వచ్చిన… https://t.co/yWzh1jDCS8 — Budda Venkanna (@BuddaVenkanna) June 18, 2024 దమ్ముంటే జగన్ పులివెందులలో (Pulivendula) రాజీనామా చేయాలని సవాల్ విసిరారు ట్వీట్ లో పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికలకు వెళ్దామని బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో జగన్‌కు 151 సీట్లు వస్తే అది విజయమా.. అదే తమకు 164 సీట్లు వస్తే ఈవీఎంలపై మాట్లాడతారా? అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ చిలక జోస్యం ఆపాలని హెచ్చరించారు. #ys-jagan #tdp #evm #budda-venkanna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి