బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఆర్సీపీ తో పాటు మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు.
మంగళవారం ఆయన సిర్పూర్ నియోజకవర్గానికి వచ్చారు. కాగజ్ నగర్ పట్టణంలోని పెద్దగుడి వద్ద ఆయన వాహనం ఆగి ఉన్న సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా కారును ఢీకొట్టింది. ఆర్సీపీ కారు ప్రమాదానికి గురైందని తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు కంగారు పడ్డారు. ఆయన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. బీఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ప్రవీణ్ కుమారే కావడంతో కార్యకర్తలు ఒకింత ఆందోళనకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ ప్రమాదం లో కారు వెనకు భాగం దెబ్బతింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు. నవంబర్ 30 న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
బీఎస్పీ రాష్ట్ర వ్యాప్తంగా 118 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఈ క్రమంలోనే ప్రవీణ్ తో పాటు ఎన్నికల అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు నవంబర్ 30 న ఓటు వేసి గుణపాఠం చెప్పాలని ఆర్సీపీ పిలుపునిచ్చారు.
Also read: తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లకు గుడ్‌న్యూస్..ఆ రెండు రోజులు సెలవులు!