Crime : శృంగారంపై మోజుతో యువకులను వేధించిన వివాహిత.. ప్రియుడు ఏం చేశాడంటే! మితిమీరిన శృంగారం కోరికలతో రగిలిపోయిన ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. యువకులతో పరిచయం పెంచుకుని కామవాంఛ తీర్చుకునే శోభ ప్రియుడిని పెళ్లాడకుండా అడ్డకుంది. దీంతో విసిగిపోయిన నవీన్ కత్తితో గొంతుకోసి చంపాడు. ఈ ఘటన బెంగళూర్ లో జరిగింది. By srinivas 24 Apr 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Bangalore : శృంగారంపై మోజు(Obsession With Romance) తో ఓ వివాహిత(Married) దారుణానికి పాల్పడింది. యువకులతో వరుస అక్రమ సంబంధాలు(Illegal Affairs) పెట్టుకుంటూ చివరకు కుటుంబాన్ని చిన్నాభిన్నాం చేసుకుంది. అంతేకాదు ఇద్దరు పెళ్లైన కూతుళ్ల ముందే ప్రియుడితో సరసాలుడుతూ నీచంగా ప్రవర్తించింది. అదే అదనుగా కోరికలతో రగిలిపోయిన ఆమె ప్రేమించిన వ్యక్తి చేతిలో ప్రాణాలు కోల్పోయిన(Brutal Murder) సంఘటన బెంగళూరులోని కొడిగేహళ్లీ భద్రప్ప లేఅవుట్‌లో చోటుచేసుకుంది. ప్రియుడిపై మోజు తగ్గని శోభ.. ఈ మేరకు సంఘనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శోభ అనే 48 ఏళ్ల మహిళ కొడిగెహళ్లిలో నివాసం ఉంటుంది. ఈమె ఇద్దరి కూతుళ్లకు పెళ్లి చేసి అక్కడే ఇళ్లు కట్టుకుని జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా నవీన్ అనే ఓ వ్యక్తి పరిచయం చేసుకుంది. అదికాస్త ప్రేమగా మారింది. కొంతకాలం అక్రమ సంబంధం కొనసాగించారు. అయితే నవీన్‌కు శోభపై బోర్ కొట్టడంతో నెమ్మదిగా దూరం పెట్టాడు. అయిన ప్రియుడిపై మోజు తగ్గని శోభ.. పదే పదే శృంగారం చేయమని బలవంతం చేయడం మొదలుపెట్టింది. దీంతో మరింత విసిగిపోయిన నవీన్.. వివాహితను దారుణంగా హతమార్చి పారిపోయాడు. అయితే తల్లికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడిన కూతుళ్లు.. ఇంటికి వచ్చి చూడగా శోభ రక్తపు మడుగులో విగతజీవిగా పడివుంది. దీంతో వెంటనే తమకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: Gujarat: వాళ్లను పంపించి రాహుల్ నపుంసకుడో కాదో చెప్పమనండి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు! యువకులతో సెక్స్ రిలేషన్.. ఇదిలావుంటే.. హత్యకు గురైన శోభ యువకులపై మోజు పడేదట. కొంతమంది పరిచయంలేని కుర్రాళ్లతో శృంగారంలో పాల్గొన్నట్లు విచారణలో నవీన్ వెల్లడించాడు. అంతేకాదు తన ఫోన్ లో యాపిల్, బనానా, ఆరెంజ్ అంటూ కుర్రాళ్లకు పేర్లు పెట్టుకున్నట్లు గుర్తించారు. తనను కూడా పెళ్లి చేసుకోకూడని, ఆమెతో ఇలాగే ఉండాలంటూ బెదిరించేదని చెప్పాడు. వేధింపులు తట్టుకోలేక ఆమె గొంతుకోసి హత్య చేసినట్లు నవీన్ అంగీకరించాడు. #bengalore #wife-was-brutal-murder #married-woman-murder #obsession-with-romance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి