K Keshava Rao: తెలంగాణలో బీఆర్ఎస్ పవర్ కోల్పోవడంపై కే కేశవరావు సంచలన వ్యాఖ్యల చేశారు. అలాగే తన పార్టీ మార్పుపై కూడా ఒపేన్ అయ్యారు. బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లడానికి సిద్ధమైన ఆయన కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా పార్టీ మార్పుపై తన మనసులో మాట బయటపెట్టారు.
55 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నా..
ఈ మేరకు తాను 55 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) తనుకు అనేక పదువులు ఇచ్చిందని గుర్తు చేశారు. నేను తెలంగాణ వాది. అక్కడే కాంగ్రెస్ తో విడిపోవాల్సి వచ్చింది. తెలంగాణ కోసం కేసీఆర్ (KCR) పోరాటం చేశారు. కానీ పార్లమెంట్ లో బిల్ కాంగ్రెస్ వల్లే పాస్ అయింది. ఎంతో పోరాడి కేసీఆర్ తెలంగాణ సాధించాడు. అయినప్పటికీ పార్టీ ఓడిపోయింది. కుటుంబపాలన అనే అంశం ప్రజలలోకి బలంగా వెళ్లింది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఇదొక బలమైన కారణం అని చెప్పారు.
నన్ను ఆపితే బాగుండు..
ఇక తనకు బీఆర్ఎస్ పార్టీ చాలా గౌరవం ఇచ్చిందని, అంతటి గౌరవాన్ని ఇంకెవరు ఇవ్వలేరన్నారు. అలాగే బాల్క సుమన్ , శ్రీనివాస్ యాదవ్ వీళ్లది పెద్ద కమ్యూనిటీ కాబట్టి వీళ్లను ముందు పెట్టి పార్టీ నడిపితే బాగుండేది. ఇక ‘నేను ఘర్ వాపస్ పోవాలి అని డిసైడ్ అయ్యాను. నన్ను ఆపితే బాగుండు అని కేసీఆర్ అనుకున్నాడు. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం శాశ్వతంగా ఉంటుంది. ఇండియా కూటమి చీలి పోలేదు. నా కూతురు కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది’ అని కేశవరావు స్పష్టం చేశారు.