Telangana: నేడు బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక?

నేడు బీఆర్ఎస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ఎల్‌పీ నేగా కేసీఆర్‌ను ఎన్నుకోనున్నారు. కాంగ్రెస్‌కు ధీటైన సమాధానం చెప్పాలంటే.. కేసీఆర్ అసెంబ్లీలో ఉండాలని మెజార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

Telangana: పక్కా వ్యూహంతో బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించేనా?!
New Update

Hyderabad: శనివారం నాడు తెలంగాణ శాసనసభ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సీఎల్పీ నేతగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఎల్పీ నేత ఎవరు అనే అంశంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌నే ఎన్నుకోనున్నట్లు సమాచారం అందుతోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం తెలంగాణ భవన్‌లో సమావేశమై ఈ మేరకు తీర్మానం చేస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

కాగా, తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం 39 స్థానాల్లో మాత్రమే గెలుపొంది అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. ఈ 39 మందిలో కేసీఆర్ కూడా ఒకరు. ఆయన కాలు జారి కిందపడటంతో తుంటి ఎముక విరిగింది. ఆయనకు యశోధ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. మరో 6 నుంచి 8 ఎనిమిదివారాలు రెస్ట్ తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఇప్పట్లో లేదనే చెప్పొచ్చు. ఇక మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొని.. కేసీఆర్‌ను తమ ఎల్పీ నేతగా ఎన్నుకుంటారని సమాచారం. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టి, ఆ తీర్మానాన్ని ఆమోదిస్తారని తెలుస్తోంది.

ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉంటారా?

అయితే, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉంటారా? ఉండరా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. రాష్ట్ర అసెంబ్లీలోనే ఆయన అత్యంత సీనియర్ నాయకుడు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రి, స్పీకర్‌గా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక రేవంత్‌కు, కేసీఆర్‌కు మధ్య వైరం తెలిసిందే. ఈ తరుణంలో కేసీఆర్ విపక్ష నేతగా వ్యవహరిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే, ఎల్పీ లీడర్‌గా కేసీఆరే ఉండాలని బీఆర్ఎస్‌ పార్టీ మెజార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారట. ఆయనైతేనే.. ప్రభుత్వం లేవనెత్తే అంశాలకు సరైన సమాధానం ఇవ్వగలరని, కేసీఆర్ అసెంబ్లీలో ఉండాలని భావిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

Also Read:

నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం

#kcr #telangana-news #hyderabad-news #brs-party
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe