KTR: కాంగ్రెస్ కథ ఖతం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ ఖతం అని అన్నారు కేటీఆర్. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. మోడీని, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదని అన్నారు. మోసం కాంగ్రెస్ నైజం, నయవంచనకు నిలువెత్తు రూపం అని పేర్కొన్నారు.

New Update
MLA KTR: త్వరలో బీజేపీలోకి రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

MLA KTR: కాంగ్రెస్ పార్టీపై (Congress Party) విమర్శల దండయాత్రను కొనసాగిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR). తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) బాధ్యతలు చేపట్టి 45 రోజులైనా సాధించింది ఏమీ లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి సాధించింది వారానికి రెండు ఢిల్లీ వెళ్లడం మాత్రమేనని చురకలు అంటించారు. ఢిల్లీ నుంచే తెలంగాణలో కాంగ్రెస్‌ పాలనంతా సాగుతుందని విమర్శించారు. దావోస్‌కు వెళ్లి ప్రపంచవేదికపై పచ్చి అబద్ధాలే మాట్లాడారని.. అందులో ఎలాంటి నిజాలు లేవని అన్నారు.

ALSO READ: రైతు బంధు ఇప్పట్లో లేనట్లే.. రేవంత్ షాకింగ్ ప్రకటన

తాజాగా ట్విట్టర్ (X) లో కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమిలోని పార్టీలు దూరం అవ్వడం సెటైర్లు వేశారు కేటీఆర్. ఆయన ట్విట్టర్ లో.. "మోసం కాంగ్రెస్ నైజం, నయవంచనకు నిలువెత్తు రూపం.. కాంగ్రెస్, అందుకే ఆదిలోనే ఇండియా కూటమికి బీటలు.. అందుకే కాంగ్రెస్ ను వీడి టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీల ఒంటరి పోరు... మిత్రపక్షాలను ఒప్పించలేని కాంగ్రెస్ దేశ ప్రజలను ఏం మెప్పిస్తుంది. మోదీని, బిజెపిని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదు.. ఇండియా కూటమికి అంతకన్నా లేదు.. మిత్రపక్షాలు దూరం కావడమే ఇందుకు నిదర్శనం. ఇక దేశప్రజల చూపు ప్రాంతీయ శక్తులవైపే... తెలంగాణలో కెసిఆర్ అయినా... బెంగాల్ లో మమతా దీదీ అయినా... పంజాబ్, ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా... పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేది.. రాష్ట్రాల్లో బలమైన పార్టీలే.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ ఖతం. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో.. ప్రాంతీయ శక్తుల పాత్రే కీలకం. జై తెలంగాణ - జై బీఆర్ఎస్" అంటూ రాసుకొచ్చారు.

ఎల్లుండి నుంచే..

ఎల్లుండి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షనిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాలలో జనరల్‌ బాడీ సమావేశాలు జరగనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 10లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని కేటీఆర్ అన్నారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాం అని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గాల్లో పటిష్టంగా పనిచేసి ఉంటే గెలిచే వాళ్లం అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

ALSO READ: మాజీ సీఎం కేసీఆర్‌కు షాక్!

DO WATCH:

Advertisment
తాజా కథనాలు