MLA KTR: నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా?.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు TG: రాష్ట్రంలో మహిళలకు రూ.2500 ఇస్తున్నామని రాహుల్ చేసిన వ్యాఖ్యలకు 'X' లో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. "రేవంత్, నువ్వు కట్టుకుంటావా చీర? లేదా రాహుల్‌కి కడుతావా.. ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?" అంటూ ట్వీట్ చేశారు. By V.J Reddy 05 May 2024 in Latest News In Telugu కరీంనగర్ New Update షేర్ చేయండి MLA KTR: సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అవి అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం రేవంత్ మరోసారి హామీల పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు. ALSO READ: రేపు భారతితో గొడవైతే నేనే కారణమా?.. జగన్‌పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు కేటీఆర్ ట్విట్టర్ (X) లో.." రేవంత్ రెడ్డి, నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?, తెలంగాణాలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 యేండ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెసుని బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని, చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం" అని అన్నారు. "కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కల్యాణ లక్ష్మి నిలిచింది, తులం బంగారం అడ్రస్ లేదు. ఫ్రీ బస్సు అని బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి. అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్ కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని, చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది" అంటూ కాంగ్రెస్ విఫలలను రాసుకొచ్చారు. రేవంత్ రెడ్డి, నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా? తెలంగాణాలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 యేండ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెసుని… pic.twitter.com/lI25q6Adgw — KTR (@KTRBRS) May 5, 2024 #cm-revanth-reddy #mla-ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి