Telangana: బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా.. జనతా కా మూడ్ సర్వే లెక్కలివే..

తెలంగాణలో మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీనే అధికారం చేపడుతుందని జనతా కా మూడ్ సర్వే ప్రకటించింది. తెలంగాణలో 72-72 స్థానాలతో బీఆర్ఎస్ మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ 31-36, బీజేపీ 4-6, ఎంఐఎం 6-7 స్థానాలు గెలిచే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.

Telangana: బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా.. జనతా కా మూడ్ సర్వే లెక్కలివే..
New Update

Janta Ka Mood Telangana 2023 Election Survey: దాదాపు మెజారిటీ సర్వేల నోట ఒకటే మాట వినిపిస్తోంది. కొన్ని సీట్లు అటో ఇటో.. మొత్తంగా అధికారం మాత్రం బీఆర్ఎస్‌దే(BRS) అని ఘంటాపథంగా చెబుతున్నాయి. తాజాగా జనతా కా మూడ్(Janta Ka Mood) సంస్థ ఇదే విషయాన్ని చెప్పింది. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారం బీఆర్ఎస్‌దే అని తేల్చి చెప్పేసింది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని ప్రకటించింది. ఇటీవల జనతా కా మూడ్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సర్వే చేపట్టింది. ఈ సర్వేలో నెక్ట్స్ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని తేలింది. ఈ మేరకు సర్వే నివేదికను ప్రకటించింది జనతా కా మూడ్ సంస్థ. దీని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో సర్వే సంస్థలన్నీ తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రజల నాడి ఏంటి? ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? వంటి వివరాలను తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనతా కా మూడ్ సంస్థ తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికలు సర్వే చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 1,20,000 శాంపిల్స్ తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో 1000 మందికి పైగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. తెలంగాణ సర్వేలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన అన్ని రకాల అంశాలను నేరుగా ప్రజలను ఇంటర్వ్యూ చేసి, వివరాలను సేకరించారు. ముస్లిం మైనార్టీలను కూడా ఇంటర్వ్యూ చేశారు.

తెలంగాణలో 18 నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న పురుషులు, మహిళలకు అందరిని ఓటింగ్ గురించి అడిగి తెలుసుకున్నట్లు సర్వే సంస్థ తెలిపింది. తెలంగాణలో గల అన్ని వర్గాలను, కులం, మతం దృష్టిలో పెట్టుకొని సర్వే చేశామన్నారు. 2014 , 2018 అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలను కూడా దృష్టిలో ఉంచుకుని.. 2023 ఎన్నికలు సర్వే చేపట్టామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

పోటీ ఆ రెండు పార్టీల మధ్యే..

2023 ఎన్నికల్లో రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు ఉండనుందని సర్వే సంస్థ ప్రకటించింది. ఆ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ అని స్పష్టం చేసింది. 1 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. యువత ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సంస్థ పేర్కొంది. రూరల్ ఏరియాలో 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు యువత కాంగ్రెస్ వైపు ఉన్నట్లు జనతా కా మూడ్ సంస్థ తెలిపింది. 60 ఏళ్ల ఓటర్లు అందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నట్లు పేర్కొంది సంస్థ. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు గుర్తించింది సంస్థ. ఆదిలాబాద్‌లో త్రిముఖ పోరు ఉంటుందని సర్వే సంస్థ తెలిపింది. మెదక్లో కొన్ని స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని జనతా కా మూడ్ తెలిపింది. నల్లగొండల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఎడ్జ్ ఉందని ప్రకటించింది సర్వే సంస్థ.

ఓట్ షేరింగ్..

ఓవరాల్‌గా చూసుకుంటే.. బీఆర్ఎస్ ఓటు శాతం 41 శాతం, కాంగ్రెస్ ఓటు శాతం 34 శాతం, బీజేపీ 14 శాతం, ఏఎంఐఎం 3 శాతం, ఇతరులు 8 శాతం మేర ఓట్లు పోల్ అవకాశం ఉందని జనతా కా మూడ్ సంస్థ తెలిపింది.

సీట్ల పరంగా..

తెలంగాణలో సీట్ల పరంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి 72 నుంచి 75 సీట్లు వస్తాయని జనతా కా మూడ్ సంస్థ ప్రకటించింది. ఇక విపక్ష పార్టీ కాంగ్రెస్‌కు 31 నుంచి 36, బీజేపీకి 4 నుంచి 6, ఎంఐఎం పార్టీకి 6 నుంచి 7 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే సంస్థ ప్రకటించింది.

సీఎంగా కేసీఆర్‌కి జై..

తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కే ఎక్కువ మంది ప్రజలు జై కొట్టినట్లు జనతా కా మూడ్ సర్వే సంస్థ తెలిపింది. సీఎం అభ్యర్థిగా కేసీఆర్ పేరును చాలా మంది అంగీకరించారని సర్వే పేర్కొంది. వివిధ పార్టీల్లో సీఎం స్థాయి నాయకులు లేకపోవడం కేసీఆర్‌కు ప్లస్‌గా మారిందని విశ్లేషించింది సర్వే సంస్థ. ఇక తెలంగాణలో రైతు బంధు పథకం, ఉచితంగా 24 గంటలు కరెంట్.. ఈ రెండు పథకాలకు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, ధరణి పోర్టల్, పాదయాత్రలపై సర్వేలో ప్రశ్నలు అడగలేదని సర్వే సంస్థ తెలిపింది.

#telangana #telangana-elections #telangana-politics #janta-ka-mood-telangana-2023-election-survey
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe