K Keshava Rao: కాంగ్రెస్ లోకి పోతున్నా బ్రదర్.. కేసీఆర్ కు చెప్పేసిన కేకే?

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కే కేశవరావు ఈ నెల 30న కాంగ్రెస్ లో చేరడం కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ను ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ కు వెళ్లి కలిసిన కేకే పార్టీ మారే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. కేకేతో పాటు ఆయన కూతురు విజయలక్ష్మి కూడా పార్టీ మారే అవకాశం ఉంది.

K Keshava Rao: కాంగ్రెస్ లోకి పోతున్నా బ్రదర్.. కేసీఆర్ కు చెప్పేసిన కేకే?
New Update

BRS MP K Keshava Rao May Join Congress: నేతల వరుస వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి (BRS) మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కాంగ్రెస్ లో (Congress) చేరడం కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 30న ఆయన హస్తం గూటికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జి దీపాదాస్ మున్షి ఇటీవల కేకే ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని కోరిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి కేకేతో పాటు ఆయన కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కేకే ఈ రోజు కేసీఆర్ ను (KCR) కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ మారుతున్నాన్న నిర్ణయాన్ని చెప్పేందుకే కేకే కేసీఆర్ ను కలిసినట్లు ప్రచారం సాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే కేకే ఈ నెల 30న కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: KCR: కేసీఆర్‌కు భారీ షాక్.. ఫౌమ్ హౌజ్‌లో తనిఖీలు చేసి సీజ్ చేయాలని డీజీపీకి కంప్లైంట్!

కేసీఆర్ తో పదేళ్లకు పైగా ప్రయాణం:

ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పని చేసిన కేకే.. సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. అయితే.. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ లో చేరారు. కేకే కు పార్టీ సెక్రటరీ జనరల్ గా అవకాశం కల్పించారు కేసీఆర్. అయితే.. కేకే జహీరాబాద్ (Zaheerabad) నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆయనకు ఆ అవకాశం దక్కలేదు.

కానీ.. వరుసగా పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి కూడా ఆయనకే దక్కింది. ఇంకా అభ్యర్ఠుల ఎంపిక కమిటీకి కూడా ఆయనే ఛైర్మన్ గా వ్యవహరించారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని కూడా అప్పగించారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేకే మళ్లీ సొంతగూటికి చేరాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

#mp-keshava-rao #congress #kcr #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe