Narsapur BRS Candidate Sunitha Laxma Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొదటి నుంచి దూకుడుగా ఉంది బీఆర్ఎస్ పార్టీ(BRS). తొలి విడత పేరుతోనే ఏకంగా 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్(CM KCR). అయితే, 4 స్థానాలను మాత్రం సస్పెన్స్‌లో పెట్టిన గులాబీ దళపతి.. ఇప్పుడు ఆ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా కన్ఫామ్ చేస్తున్నారు. తాజాగా మెదక్(Medak) జిల్లాలోని నర్సాపూర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని ప్రకటించారు. ఆ మేరకు ఆమెకు బుధవారం నాడు బీఫామ్ కూడా అందజేశారు. అయితే, ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ స్థానం కేటాయించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాంతో.. ఆయన స్థానంలో సునీత లక్ష్మారెడ్డి పేరును కన్ఫామ్ చేశారు గులాబీ బాస్. ఇక ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో సీఎం కేసీఆర్ ఆమెకు నర్సాపూర్ బీఫామ్‌ను అందజేశారు.
బీఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ కీలక నిర్ణయం..
ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలిన పార్టీ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ.. అధినేత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన బీఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ కీలక సభ్యులు తీసుకున్న నిర్ణయంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ఈ బండి మీదనే పాలమ్మిన.. స్కూటర్ నడిపి సందడి చేసిన మల్లారెడ్డి!
కేసీఆర్ ప్రశంసలు..
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘మదన్ రెడ్డి నాతో పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏళ్ల నుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు. సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుంది. ప్రస్థుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు. ఆయన సీనియారిటిని పార్టీ గుర్తించి గౌరవించినందుకు పార్టీ మఖ్య కర్యవర్గాన్ని అభినందిస్తున్నాను. మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్‌లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయన పాపులర్ లీడర్. వివాద రహితుడు, సౌమ్యుడైన మదన్ రెడ్డి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సివుంది. నాతో పాటు కలిసి సునీతకు నర్సాపూర్ నియోజకవర్గ బీఫామ్ ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగించింది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు. ఆయనకు నా ధన్యవాదాలు, అభినందనలు.’ అని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి డీకే అరుణ, విజయశాంతి?