BREAKING: సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. కారణం ఇదేనా?

సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ రోజు సీఎం రేవంత్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు సమావేశం అయ్యారు. వీరి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

New Update
BREAKING: సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. కారణం ఇదేనా?

BRS MLA's Meets CM Revanth Reddy: మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ రోజు సీఎం రేవంత్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక) , గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు) , మాణిక్ రావు (జహీరాబాద్) సమావేశం అయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకు భేటీ అయ్యారనే దానిపై ప్రజల నుంచి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కాంగ్రెస్ లోకి జంప్?

ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి ఓడిన పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అవ్వడం రాజకీయాల్లో కొన్ని ఏండ్లుగా వస్తున్న ఆనవాయితీ. గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఅర్ఎస్ పార్టీ ప్రస్తత బీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికలోనూ, 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు. అయితే.. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి కాంగ్రెస్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నెలకొంది.

అందుకోసం కాదు.. 

ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. తాము త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతామని పుకార్లు వస్తున్నాయని వాటిని నమ్మవద్దని అన్నారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. తమ నియోజక వర్గ సమస్యలు చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయినట్లు వెల్లడించారు.

ప్రోటోకాల్ వివాదంపై..

ప్రోటోకాల్ వివాదంపై ఇంటెలిజెన్స్ చీఫ్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అధికారిక కార్యక్రమాల పర్యటనలో పోలీస్ ఎస్కార్ట్ ను తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ పాటించకపోతే నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అన్నారు.

brs mla's

Also Read: అదనపు పోస్టులతో ఫిబ్రవరిలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌?.. సిలబస్‌ ఇదే

NEWS IS BEING UPDATED

Advertisment
తాజా కథనాలు