మహారాష్ట్రలో దూసుకెళ్తున్న కారు.. 57 సర్పంచ్‌ లు గులాబీ కే!

మహారాష్ట్రలో 130 సర్పంచ్‌ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా..అందులో ఏకంగా 57 పదవులను బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.

New Update
బోణి కొట్టిన బీఆర్ఎస్

తెలంగాణ (Telangana) లో అడ్డులేకుండా సాగుతున్న '' కారు'' ప్రయాణం..ఇప్పుడు మహారాష్ట్రలో(Maharashtra)  కూడా ప్రవేశించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటు అయిన బీఆర్‌ఎస్‌ మొదటిసారి ఎన్నికల్లో నిలిచినప్పటి నుంచి కూడా విజయకేతనం ఎగురవేస్తూనే ఉంది.

పార్టీగా ఆవిర్భవించిన కొద్ది కాలంలోనే సంచలన విజయాలను నమోదు చేసిన బీఆర్‌ఎస్‌(BRS)..అలుపెరగని పోరాటాలతో సొంత రాష్ట్రం సాధించింది. ఇప్పటికే సొంత రాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేపట్టింది. మూడోసారి కూడా హ్యాట్రిక్‌ విజయం సాధించడానికి రెడీగా ఉంది.

తెలంగాణలో మాదిరిగానే..ఇప్పుడు పక్క రాష్ట్రం అయిన మహారాష్ట్రలోనూ '' గులాబీ'' తుఫాన్‌ మొదలైనట్లు కనిపిస్తుంది. మహారాష్ట్రలో అడుగుపెట్టిన బీఆర్‌ఎస్‌ అతి కొద్ది నెలల్లోనే..సర్పంచ్‌ ఉప ఎన్నికల్లో సత్తా చాటింది.

Also read: మాటలకే మాటలు నేర్పిన మాంత్రికుని బర్త్‌ డే స్పెషల్‌!

మహారాష్ట్రలో 130 సర్పంచ్‌ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా..అందులో ఏకంగా 57 పదవులను బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. అంటే గులాబీ జెండా 44 శాతం స్థానాల్లో ఎగరవేసింది. మొత్తంగా 327 వార్డుల్లో గులాబీ జెండా ఎగిరింది. సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన తరువాత ఆయన దేశం ముందు ఉంచిన సంక్షేమ ఎజెండాకు ప్రజలు ఆదరణ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది.

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సాధించిన విజయంతో దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శకం మొదలైందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని 2,359 గ్రామపంచాయతీల్లో ఖాళీగా ఉన్న 130 సర్పంచ్‌ పదవులకు ఆదివారం ఉప ఎన్నికలు నిర్వహించారు. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు.

Also read: ఎల్బీ స్టేడియంలో నేడు మోదీ బహిరంగ సభ..హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

Advertisment
తాజా కథనాలు