KTR: సొంత జిల్లాలో కేటీఆర్‌కు బిగ్ షాక్

సొంత జిల్లాలో కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ కౌన్సిల్‌లో ముసలం మొదలైంది. మున్సిపల్ ఛైర్మన్ పై కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు సొంత పార్టీ కౌన్సిలర్లే నిర్ణయం తీసుకున్నారు. దీంతో కౌన్సిలర్లను బుజ్జగించే పనిలో పడ్డారు కేటీఆర్.

KTR: సొంత జిల్లాలో కేటీఆర్‌కు బిగ్ షాక్
New Update

MLA KTR: ఈరోజు తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మాజీ మంత్రి కేటీఆర్. సిరిసిల్ల బీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో సొంత జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ నేతలే కేటీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చారు.మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టారు కౌన్సిలర్లు.

సిరిసిల్లలో మున్సిపల్ కౌన్సిల్ లో ముసలం మొదలైంది. మున్సిపల్ చైర్మన్ పై కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు సొంత పార్టీ కౌన్సిలర్లే నిర్ణయం తీసుకున్నారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపడం.. కొందరినే అందలం ఎక్కించడంపై కౌన్సిలర్లలో అసంతృప్తి నెలకొంది. నియోజకవర్గం స్థాయి భేటీలో కౌన్సిలర్ల ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైర్ పర్సన్ తో విభేదించిన 12 మంది కౌన్సిలర్లు క్యాంపుకు వెళ్లినట్లు సమాచారం.

కాంగ్రెస్ కారణం?

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా కేటీఆర్ కు సిరిసిల్ల నియోజకవర్గంలో గెలవడం పెద్ద తలనొప్పిగా మారింది. ఆ సమయంలో కేటీఆర్ కార్యకర్తలను బుజ్జగించే పనిలోనే పడ్డారు. ఎన్నికల్లో సిరిసిల్ల లో గెలిచినా కేటీఆర్.. రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయలేక పొయ్యాడు. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కేటీఆర్ పై సొంత నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రతిరూపమే కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ పై తిరగబడడం అని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నెలకొంది. మునుముందు సిరిసిల్లో రాజకీయాలు ఎలా మారుతాయో వేచి చూడాలి మరి.

DO WATCH:

#ktr #rajanna-sircilla #brs-party
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe