మణిపూర్ అల్లర్లపై కవిత స్ట్రాంగ్ రియాక్షన్.. మీరే బాధ్యులంటూ విమర్శలు..!!

మణిపూర్ హింసకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మణిపూర్ ఘటనలను ప్రభుత్వ ప్రాయోజిత హింసగా పేర్కొన్నారు. బీజేపీ విభజించు పాలించు సిద్ధాంతాన్ని అవలంబిస్తూ...ఓట్లకోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. శనివారం శాసనమండలిలో రాష్ట్రంలో గిరిజన సంక్షేమం-పోడుపట్టాల పంపిణీ అంశంపై కవిత మాట్లాడారు.

మణిపూర్ అల్లర్లపై కవిత స్ట్రాంగ్ రియాక్షన్.. మీరే బాధ్యులంటూ విమర్శలు..!!
New Update

ఈశాన్యరాష్ట్రమైన మణిపూర్ లో జరుగుతున్న హింసకు కేంద్ర, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. శనివారం రాష్ట్ర శాసన మండలిలో గిరిజన సంక్షేమం, గిరిజనులకు అటవీ భూమిని పోడు సాగు కోసం పంపిణీ చేయడంపై జరిగిన లఘు చర్చపై కవిత మాట్లాడారు. మణిపూర్‌లో జరిగిన హింసాకాండ ప్రభుత్వ ప్రాయోజితమని, అందులో బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. రాష్ట్రంలోని కుకిస్, మెయిటీస్ రెండు జాతుల మధ్య చీలికను సృష్టించిందని ఫైర్ అయ్యారు. మణిపూర్‌లోని రెండు వర్గాలను ఒకరితో ఒకరు పోటీకి దించి రాష్ట్రాన్ని వార్‌ జోన్‌గా బీజేపీ మార్చి చోద్యం చూస్తుందంటూ విమర్శించారు. ఇది రాష్ట్ర ప్రాయోజిత హింస...దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి,” అని కవిత అన్నారు. మణిపూర్‌లో పరిస్థితిని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయంటూ మండిపడ్డారు.

ఎన్నికల ప్రయోజనాల కోసం కాషాయ పార్టీ విభజించు పాలించు విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో సమైక్యం, అభివృద్ధి నినాదంతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలను ఖండిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలు తమ వెంట ఉన్నారని మణిపూర్ ప్రజలు తెలుసుకోవాలి... హింసను మనం ఏక కంఠంతో ఖండించాలి'' అని కవిత అన్నారు.

మణిపూర్‌లో శాంతిభద్రతల పునరుద్ధరణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్న కవిత వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏకీభవించారు. ఇది నిజంగానే రాష్ట్ర ప్రాయోజిత హింస అన్ని అన్నారు. గిరిజన సంక్షేమంపై, షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీ విస్తరణ (పెసా) చట్టాన్ని కేంద్రం సక్రమంగా అమలు చేయడం లేదని, తద్వారా గిరిజన హక్కులకు భంగం కలిగిస్తోందని కవిత ఆరోపించారు. దేశంలోనే పెసా చట్టాన్ని అక్షరబద్ధంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

కొత్త అటవీ సంరక్షణ నిబంధనలను తీసుకురావడం ద్వారా ధనిక కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రధాని మోదీ అటవీ చట్టాలను పలుచన చేశారని కవిత ఫైర్ అయ్యారు. షెడ్యూల్డ్ కులాల సబ్ ప్లాన్ కింద రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. మరోవైపు, తెలంగాణ సర్కార్ ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌టిఎస్‌డిఎఫ్)ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. దీని కింద రూ. 91,531 కోట్లు కేటాయించనట్లు కవిత పేర్కొన్నారు. గిరిజనుల కోసం వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 56,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని ఈ సందర్భంగా కవిత తెలిపారు.

#bjp #manipur #brs-kavitha #incidents #tribal-rights
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe