/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/M-sanjay-jpg.webp)
BRS MLA Sanjay Kumar: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, సీనియర్ న్యాయవాది మాకునూరి హన్మంతరావు కొద్దిసేపటి క్రితం మరణించారు. పార్థివదేహాన్ని హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఎమ్మెల్యే గృహంలో ఉంచారు. కాగా, ఈరోజు రాత్రి 8 గంటలకు మోతే శ్మశానవాటిక (శంకర్ ఘాట్)లో అంత్య క్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ కుమారు పలువురు ప్రముఖులు పరామర్శించారు.
కేసీఆర్ సంతాపం..
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి అకాల మరణం పట్ల సంతాపం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం.సంజయ్ కుమార్ తండ్రి, హన్మంతరావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
— BRS Party (@BRSparty) March 29, 2024
Also Read: ఫోన్‌ట్యాపింగ్‌పై CM రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు