Malla Reddy : డొక్కు సైకిల్‌పై తిరిగిన మల్లారెడ్డి.. వందల కోట్లకు ఎలా ఎదిగారు?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డి పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. డొక్కు సైకిల్‌ పై తిరిగిన మల్లారెడ్డి ఇప్పుడు వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు. రాజకీయాల్లోనే సెంటర్ ఆఫ్‌ అట్రాక్షన్‌ గా ఎలా మారారు అనే విషయాలు గురించి ఈ కథనంలో చదివేయండి

MLA Mallareddy: మాజీమంత్రి మల్లారెడ్డిపై కేసు
New Update

Telangana Politics : తెలంగాణ(Telangana) రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డి(Malla Reddy) పేరు తెలియని వారు ఎవరు ఉండరు. డొక్కు సైకిల్‌ పై తిరిగిన మల్లారెడ్డి ఇప్పుడు వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు. రాజకీయాల్లోనే(Politics) సెంటర్ ఆఫ్‌ అట్రాక్షన్‌ గా ఎలా మారారు అనే విషయాలు మాత్రం ఇప్పటికే గప్ చుపే. మల్లారెడ్డి కాలేజీలు గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.. పాలు పెరుగు అమ్మిన వ్యక్తి కాలేజీలకు అధిపతి ఎలా అయిపోయారు?

గత రెండు రోజులుగా తెలంగాణలో హాట్‌ టాపిక్‌ గా మారిన మల్లారెడ్డి ప్రస్థానం ఎక్కడ నుంచి మొదలైంది. కేవలం స్కూళ్లు, కాలేజీల ద్వారానే ఆయన వందల కోట్లకు అధిపతి అయ్యాడా అనే సందేహాలు చాలా మందికే ఉన్నాయి. మల్లారెడ్డి ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన యువకునిగా ఉన్న సమయంలో ఇంటింటికి తిరిగి సైకిల్‌ మీద పాలు అమ్మేవారు.

చంద్రబాబుతో సన్నిహితంగా..

ఆ తరువాత ఆయన చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి నలుగురిలో తన పేరు తెలిసేలా చేసుకున్నారు. ఆ తరువాత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తో సన్నిహితంగా మెలగడం ప్రారంభించాడు. ఆ క్రమంలోనే ఆయన స్నేహితుల సలహాతో మల్లారెడ్డి విద్యాసంస్థలను ప్రారంభించారు.

వాటిని ప్రారంభించడానికి చంద్రబాబు నాయుడ్ని ముఖ్య అతిథిగా పిలిచారు. చంద్రబాబుతో మంచి సత్సంబంధాలు ఏర్పడగానే టీడీపీలో చేరిపోయి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేశారు. అప్పటికే ఆయన విద్యాసంస్థలు వందల ఎకరాల్లో విస్తరించాయి.2018లో టీఆర్‌ఎస్‌ నుంచి మేడ్చల్‌ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు.

ఎన్నికల సమయంలో అఫిడవిట్‌ లో ఆయన సమర్పించిన ఆస్తుల విలువ రూ. 100 కోట్లు.. కానీ అనధికారికంగా ఆయన ఆస్తుల విలువ వేల కోట్లు పైనే. పాల వ్యాపారం చేసే వ్యక్తి వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు అనేది మాత్రం అందరికీ ప్రశ్నే. సూరారం, దూలపల్లి, అలియాబాద్‌, జీడిమెట్ల, యాడారం, గుండ్ల పోచంపల్లి, కండ్లకోయ ప్రాంతాల్లో మల్లారెడ్డికి లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నాయి.

కన్ను పడింది అంటే సొంతం అవ్వాల్సిందే..

మల్లారెడ్డి కన్ను పడింది అంటే అది ఆయన సొంతం అవ్వాల్సిందే అనే ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. చేగుంటలో ఏకంగా 47 ఎకరాల భూమిని ఆయన ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం గురించి శామిర్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఆయన పై కేసు కూడా నమోదు అయ్యింది.

కబ్జాదారులు,దొంగలు మనవాళ్లే ...
దుండిగల్‌ పరిధిలో 20 గుంటలు మల్లారెడ్డి కబ్జా చేశారని మల్లారెడ్డి పై ఆరోపణ ఉంది. ఈ విషయం గురించి మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు భద్రారెడ్డి పై కూడా కేసు నమోదు అయ్యింది. ఆ సమయంలో మల్లారెడ్డి ఓ రియల్టర్ ను బెదిరించిన ఆడియో కూడా బయటకు వచ్చి వైరల్ అయ్యింది. తనకు సెటిల్‌మెంట్ చేసేంతవరకు వెంచర్ ఆపాలని మల్లారెడ్డి రియల్టర్ కు వార్నింగ్‌ ఇచ్చారు. కబ్జాదారులు,దొంగలు మనవాళ్లే అంటూ మల్లారెడ్డి వీడియో వైరల్‌ అయ్యింది.

Also Read : శివరాత్రి స్పెషల్‌ ఎన్బీకే 109 నుంచి ఫ్యాన్స్‌ కి గుడ్‌ న్యూస్‌!

#telangana #politics #minister-malla-reddy #trs #colleges
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe