BRS MLA : సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. నిన్న కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల కాంగ్రెస్‌లో చేరి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరిన కృష్ణమోహన్ రెడ్డి మరోసారి హస్తం పార్టీలోకి వెళ్లనున్నట్లు చర్చ జరుగుతోంది

New Update
BRS MLA :  సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

CM Revanth Reddy : అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) జరుగుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) ఆసక్తికరంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి (Krishna Mohan Reddy) వెళ్లారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరి తిరిగి బీఆర్ఎస్ (BRS) గూటికి చేరారు కృష్ణమోహన్ రెడ్డి. నిన్న కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లారు. కృష్ణమోహన్ రెడ్డిని  కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కోరారు. దీనికి సానుకూలంగా కృష్ణమోహన్ రెడ్డి స్పందించడంతో అక్కడే మధ్యాహ్నం భోజనం చేశారు మంత్రి జూపల్లి. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారని.. ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు అని వస్తున్న వార్తలను ఖండించారు. కాగా ఇప్పటి వరకు కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడ పార్టీ మారుతున్నట్లు గాని.. కాంగ్రెస్ లో కొనసాగుతున్నట్లు గాని ప్రకటించలేదు. మరి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తరువాత కృష్ణమోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.

Also Read : నేడు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు