MLA Kadiyam: దళిత బంధు రద్దు.. రేవంత్ పై కడియం శ్రీహరి హాట్ కామెంట్స్!

బీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన దళితబంధు పథకాన్ని రద్దు చేయొద్దని అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కావాలంటే ఆ పథకం పేరు మార్చండి.. రద్దు చేసి దళితుల నోట్లో మట్టి కొట్టొద్దు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండవ విడత లబ్ధిదారులకు దళిత బంధును కొనసాగించాలని కోరారు.

New Update
MLA Kadiyam: దళిత బంధు రద్దు.. రేవంత్ పై కడియం శ్రీహరి హాట్ కామెంట్స్!

Kadiyam Srihari: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై (Congress Party) నిప్పుల చెరిగారు స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తెలంగాణ ఎన్నికల్లో  అబద్దాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. దళిత బంధు రద్దు చేసి దళితుల నోట్లో మట్టి కొట్టద్దని రేవంత్ సర్కార్ (CM Revanth Reddy) ను కోరారు.

ALSO READ: తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్!

షెడ్యూల్ కులాల వర్గీకరణ..

షెడ్యూల్ కులాల (Schedule Caste) వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పార్లమెంట్ చట్టం ద్వారానే వర్గీకరణ చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందని పేర్కొన్నారు. వర్గీకరణ అంశాన్ని 17 జనవరి నుండి ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపాల్సి ఉందని అన్నారు. అనివార్య కారణాల వల్ల బెంచ్ వాయిదా పడినట్లు తెలిసిందని తెలిపారు.

కేంద్రం వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ వేయడానికి సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను సమర్ధిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా అఫిడవిట్ ఇస్తే వర్గీకరణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలిపారు. నిపుణులైన న్యాయవాదుల చేత తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణపై వాదనలు వినిపించాలి సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు.

దళిత బంధు కొనసాగించాలి..

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏండ్లు ఉండాలని కోరుకుంటున్నట్లు కడియం శ్రీహరి అన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల ఒక్కొక్కరి అకౌంట్లల్లో 9.90 లక్షలు జమ చేసినట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు కొంత అమౌంట్ వాడుకున్నారని అన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా లబ్ధిదారుల అకౌంట్లలోని మిగతా డబ్బులు ఫ్రీజ్ అయ్యాయని తెలిపారు. 11 వేల మంది అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని.. లబ్ధిదారుల ఖాతాల ఫ్రీజ్ లను ప్రభుత్వం వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు.

చర్యలు తీసుకోండి..

1.37 లక్ష మంది రెండవ విడత లబ్ధిదారులకు దళిత బంధు స్కీమ్ కొనసాగించాలని అన్నారు కడియం శ్రీహరి. పథకం పేరు మార్చినా పర్వాలేదు, దళితులకు ఆర్థిక సహాయం ఆగొద్దని అన్నారు. దళితుల నోట్లో మట్టి కొట్టొద్దు అని అన్నారు. దళిత బంధు అమలులో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ఎంపికైన లబ్ధిదారులకు సహాయం ఆపొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ALSO READ: ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల.. వైసీపీ నేతల రియాక్షన్!

DO WATCH:

Advertisment
తాజా కథనాలు