Hydra-Harish Rao: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హరీష్‌రావు ఛాలెంజ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలాల కింద ఉన్న హైడ్రా ఆఫీసు, జీహెచ్ఎంసీ ఆఫీసులను కూల్చుతారా? అంటూ ప్రశ్నించారు. నక్లెస్‌రోడ్ పక్కనున్న రెస్టారెంట్స్, ఇతర వాణిజ్య భవనాల సంగతేంటో చెప్పాలని సవాల్ విసిరారు.

author-image
By Nikhil
New Update
Hydra-Harish Rao: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హరీష్‌రావు ఛాలెంజ్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు (Hydra Ranganath) హరీష్‌రావు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. హైడ్రా ఆఫీసు బుద్ధ భవన్ నాలా కింద ఉందని.. దాన్ని కూలగొడతారా? అని ప్రశ్నించారు. రంగనాథ్ ముందు తన ఆఫీస్ కూలగొట్టుకుని ఇతర బిల్డింగులు కూల్చాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఆఫీసు నాలా కింద ఉందని.. దాన్ని కూలగొడతారా? అని ప్రశ్నలు గుప్పించారు. నెక్లెస్‌రోడ్ పక్కనున్న రెస్టారెంట్స్, ఇతర వాణిజ్య భవనాలను కూడా కూలుస్తారా? అని అన్నారు. ఇంకా.. మీరాలం, ఉప్పల్, రామంతాపూర్ చెరువుల్లో వచ్చిన టవర్ల సంగతేంటో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతల సర్కార్ అని ధ్వజమెత్తారు. హైదరాబాద్ బ్రాండ్‌ను కూల్చివేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు