/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Harish-Rao-1-1-jpg.webp)
తెలంగాణ శాసనసభ స్పీకర్ కు మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (BRS MLA Harish Rao) కీలక లేఖ రాశారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. రేపటి నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో ఆర్థిక, సాగునీటి, విద్యుత్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Telangana MLC: గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు.. ఆ ఇద్దరి పేర్లు ఫైనల్ చేసిన కాంగ్రెస్?
ఒక వేళ ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అనుమతిస్తే.. దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు సభ ద్వారా మా వర్షన్ చెప్పవలసి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తాము కూడా ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షానికి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు హరీశ్ రావు.
గౌరవ సభాపతి గారికి,
తెలంగాణ శాసనసభ,
హైదరాబాద్.ఆర్యా!
విషయము: శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయుటకు భారత రాష్ట్ర సమితి పార్టీకి అనుమతి మంజూరు చేయుటకు వినతి.
రేపటి నుంచి జరిగే శాసనసభ సమావేశాలలో ఆర్థిక, సాగునీటి మరియు విద్యుత్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్… pic.twitter.com/y9DWom5btR
— BRS Party (@BRSparty) December 19, 2023
అయితే.. బీఆర్ఎస్ శాసనసభ పక్షానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అనుమతిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తిగా మారింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మరో సారి మాటల తూటాలు పేలే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.