Telangana: రేవంత్ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పాడు: హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై మాజీ మంత్రి హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన సభలో రేవంత్‌ రెడ్డి మూడు అబద్ధాలు చెప్పారని.. సబ్జెక్టు లేకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Telangana: రేవంత్ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పాడు: హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై మాజీ మంత్రి హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన సభలో రేవంత్‌ రెడ్డి మూడు అబద్ధాలు చెప్పారని.. సబ్జెక్టు లేకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్టింగ్ వ్యవహారంలో రిటైర్డ్ ఇంజనీరింగ్‌ల రిపోర్ట్ ను తప్పుగా చదివారు. మోటర్లకు మీటర్లు అంటూ లెటర్‌లోని లైన్ మొత్తాన్ని తప్పించి చదివి అబద్దాలు చెప్పారు. Other than agriculture connections అనే పదాన్ని రేవంత్ ఎగరగొట్టారు. ఉదయ్ స్కీం వల్ల 30 వేల కోట్లు వస్తుండే అని చెప్పే టైంలో సీఎం కలగచేసుకొని ఆఫీసర్లు సంతకాలు పెట్టారని లెటర్ చదివారు. మంద బలం, కుర్చీ బలంతో శాసనసభను మిస్లీడ్ చేస్తున్నారు. పోతిరెడ్డి పాడును దగ్గరుండి బొక్క పెట్టించారని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మేము రాజీనామా చేసిన తర్వాతే పోతిరెడ్డిపాడుకు GO విడుదల అయ్యింది.

తెలంగాణ ప్రయోజనాల కోసం 2005లో మంత్రి పదవులను వదులుకున్నాం. కోమటి రెడ్డి రాజగోపాల్ LRS ఉచితంగా చేయాలని గతంలో కోర్టులో కేస్ వేశారు. ఇప్పుడు LRS కు డబ్బులు వసూలు చేయాలని క్యాబినేట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 14 వేలు ఉన్న LRS ధరలను 18 వేలకు పెంచి వసూల్ చేద్దాం అనుకుంటున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాకు సిద్ధపడితే రేవంత్ జిరాక్స్ పేపర్ కూడా స్పీకర్‌కు ఇవ్వలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా రైఫిల్ పట్టుకుని బెదిరించిన వ్యక్తి రైఫిల్ రెడ్డి అయ్యాడు. ఒక్కనాడైన జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ రెడ్డి. కేసీఆర్ పుణ్యం వళ్లే రేవంత్ పదవులను అనుభవిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పని ఖతం అంటున్నారు. ఎన్నటికైనా మళ్ళీ బీఆర్‌ఎస్‌ వస్తుంది.1984 తర్వాత నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు ఫుల్ మెజార్టీ రాలేదు. పొత్తులతోనే నెట్టుకొస్తోంది.

Also Read: కళ తప్పుతున్న భారీ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారకం.. నో ఎంట్రీ ఎన్నాళ్లు?

మెడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదు అని సీఎం అన్నారు. మా ప్రభుత్వంలో ఇష్టమొచ్చినట్లు అప్పులు తీసుకోలేదు అని నేను అన్నాను. ఒక ముఖ్యమంత్రి సభను ఇలా మిస్ గైడ్ చేయడం ఎంతవరకు కరెక్టు.18 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎంపీ సీట్లు సున్నా.
28 పార్టీలతో కలిస్తే మీకు వచ్చిన సీట్లు 100. అది కూడా అందరి సహకారంతో 21 పర్సెంటేజ్. మహబూబ్ నగర్ ఎంపీ,MLC ఓడిపోయింది. రేవంత్‌ ఎంపీగా ఉన్న మల్కాజిగిరిలో ఒక్క MLA సీటు గెలవలేదు. రేవంత్ ఇంచార్జ్‌గా మహబూబ్‌నగర్,చేవెళ్ల,మల్కాజిగిరి ఎంపీ సీట్లు ఓడిపోయారు. రేవంత్ ముఖ్యమంత్రిగా అనర్హుడు, సీఎం పదవికి రాజీనామా చేయాలి

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని రేవంత్ దోచుకున్నాడు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు... కాంగ్రెస్‌లో రేవంత్ చేరాడు. కష్టపడ్డ నల్గొండ, మహబూబ్ నగర్, ఇంకా వేరే జిల్లాల నాయకుల కష్టాన్ని తనకు అనుకూలంగా వాడుకున్నాడు. వి.హనుమంతరావు అసలైన కాంగ్రెస్ నాయకుడు. ఆయనకీ ఏ పదవీ లేదు కాంగ్రెస్‌లో. కానీ బయటనుండి వచ్చిన వారికి అన్ని పదవులు ఇస్తున్నారు ( కేశవరావు,జితేందర్ రెడ్డి,ఎంపీన్సీట్లు బీఆర్ఎస్ నాయకులకు). మొదటిసారి కాంగ్రెస్ బీ ఫార్మ్ పైన MLA గా గెలిచి అసలైన నాయకుల పదవిని కొట్టేసాడు. జైపాల్ రెడ్డి ఎప్పుడు జై తెలంగాణ అనలేదు.. తెలంగాణకు వ్యతిరేఖంగా జైపాల్ రెడ్డి పనిచేశారు. జైపాల్ రెడ్డిని ఈ రోజు రేవంత్ పొగుడుతున్నాడు. కానీ జైపాల్ రెడ్డి బ్రతికున్నంత కాలం రేవంత్ రెడ్డిని దగ్గరికి కూడా రానివ్వలేదు. ఇప్పుడు జైపాల్ రెడ్డి పెద్ద తెలంగాణ వాదీ.. చిన్న తెలంగాణ వాది రేవంత్ అంటా.. జనాలు నవ్వుతున్నారని" హరీష్ రావు అన్నారు.

Also read: కోమటిరెడ్డి బ్రదర్స్ చెత్తగాళ్లు.. అసెంబ్లీలో మాటల తూటాలు!

Advertisment
తాజా కథనాలు