Gangula Kamalakar: బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి గంగుల కమలాకర్?

TG: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేరుతున్నట్లు మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు. కాగా నిన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.

New Update
Gangula Kamalakar: బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి గంగుల కమలాకర్?

Gangula Kamalakar: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లోకి (Congress) మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేరుతున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే అంశాన్ని మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampally Satyanarayana) వెల్లడించారు. కొన్నిరోజులుగా గంగుల కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ లో గంగుల చేరుతున్నారని చర్చ జరిగింది. ఇప్పుడు కవ్వంపల్లి ప్రెస్‌మీట్‌లో కూడా చెబుతుండడంపై చేరిక కన్ఫామే అంటూ ప్రచారం సాగుతోంది. నిన్నే కాంగ్రెస్ లో పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేరిన సంగతి తెలిసిందే.

Also Read: మియాపూర్‌లో ఉద్రిక్తత.. పోలీసులను ఉరికించుకుంటూ..

Advertisment
తాజా కథనాలు