/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-05T195808.185.jpg)
KTR: మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను వారు కలవనున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా కలవనున్నారు. కాగా మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పలు మార్లు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వెయ్యగా.. కవితకు ఈ విషయం లో నిరాశే ఎదురైంది. ప్రతిసారి బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. కాగా రేపు కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది.
చెల్లి బెయిల్ ప్రయత్నాలు..
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత జైలుపాలై దాదాపు 6 నెలలు గడుస్తోంది. తన చెల్లిని బయటకు తెచ్చేందుకు మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కవితను బయటకు తెచ్చేందుకు ఢిల్లీలోని ప్రముఖ లాయర్లతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఒకవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపులు, మరోవైపు కూతురు జైలులో ఉండడంతో మనస్తాపంతో ఉన్నారు కేసీఆర్. ఎలాగైనా తన కూతురును ఈ కేసును బయటకు తేవాలని వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టులో పోరాడుతున్నారు కేటీఆర్.
STORY IS UPDATING...
Also Read : నేడు అమెరికాకు మంత్రి కోమటిరెడ్డి