RS Praveen Kumar : వారిలా నేను గొర్రెను కాను.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్..! ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా తాను బీఆర్ఎస్ పార్టీ వీడే ప్రసక్తే లేదన్నారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గొర్రెను కానని..కాలేనని..ఇంకెక్కడి పోవాలన్న ఆలోచన తనకు లేదన్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. By Bhoomi 29 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి RS Praveen Tweet : ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా తాను బీఆర్ఎస్(BRS) పార్టీ వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు నాగర్ కర్నూల్(Nagarkurnool) పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). తాను గొర్రెను కానని.. కాలేనని.. ఇంకెక్కడి పోవాలన్న ఆలోచన కూడా తనకు లేదన్నారు. ఎవరూ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. కడియం శ్రీహరి, కేకే వంటి సీనియర్ నేతలు బీఆర్ పార్టీని వీడటంలో తనను కూడా వారి బాటనేలోనే నడవాలని చాలా మంది ఫోన్లు చేసి చెబుతున్నారని ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడొద్దని... ఈ పరిస్థితుల్లో అండగా నిలబడాల్సిన అవసరం బీఆర్ఎస్ కార్యకర్తలు తనను కోరతున్నారని తెలిపారు. తాను పార్టీని వీడనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రియమైన మిత్రులారా, దయచేసి ఎవరూ టెన్షన్ పడకండి. నేను గొర్రెను కాను. కాలేను. ఇంకెక్కడికో పోవాలన్న ఆలోచన కూడా లేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీని వీడను.👊 నేను గతంలో చేసిన బీయస్పీ-బీఆరెస్ కూటమి ప్రయత్నం కానీ, తర్వాత బీఆరెస్ లో చేరాలన్న నిర్ణయం కానీ చాలా ఆలోచించి తీసుకున్నవి. These were very conscious decisions. మళ్లీ చెబుతున్న, నేను రాజకీయాల్లోకి వచ్చింది నా స్వంత పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమో, అక్రమ ఆస్తుల కోసమో, పోలీసు కేసులకు భయపడో, హంగులు, ఆర్భాటాలున్న జీవితం కోసమో, ప్రోటోకాల్ కోసమో కాదు. నేను పుట్టి పెరిగిన సమాజం చాలా వేదనతో వెనకబడి ఉన్నది, వాళ్ల కోసం చట్ట సభల్లో ఒక గొంతుకగా బతికి, వాళ్ల జీవితాలను నా శక్తి మేరకు ‘సమూలంగా’ మార్చాలని నేను ప్రజా జీవితంలోకి వచ్చా.ఇందులో భాగంగానే బహుజన వాదం, తెలంగాణ వాదం రెండూ కలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని నేను నమ్మిన. తెలంగాణ ఫలాలు అందరికి అందాల్సిన అవసరం ఇంకా ఉందని నమ్మి, భారత రాజ్యాంగానికి ఫాసిస్టు శక్తుల వల్ల పొంచిఉన్న ప్రమాదాన్ని పసిగట్టి, అవిశ్రాంత,రాజీలేని పోరాటం నడిపి ప్రత్యేక రాష్ట్రం సాధించి, కొత్త తెలంగాణకు బలమైన పునాది వేసిన #KCR గారి నాయకత్వంలో నడుస్తున్న బలమైన BRS Party ని నేను వేదికగా ఎంచుకున్నా. ఇందులో నాకు గాని, నన్ను నమ్ముకున్న వర్గాలకు గాని ఎలాంటి సంశయం లేదు. నేడు కడియం, కేకే గార్లు అకస్మాత్తుగా@BRSparty ను వీడటంతో నాకు కొంత మంది కాల్ చేసి వారి బాటలోనే నడచి ‘మంచి’ దారి వెతుక్కోమన్నరు. మరి కొంత మంది బీఆరెస్ కార్యకర్తలు పార్టీని వీడొద్దు, ఈ పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడాలని కోరిండ్రు. ప్రియమైన మిత్రులారా, దయచేసి ఎవరూ టెన్షన్… pic.twitter.com/RTPPQvxgLw — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 29, 2024 Also Read : పంటపొలాల్లోకి కేసీఆర్.. జిల్లాల వారిగా షెడ్యూల్ సిద్ధం! గెలుపుతో వచ్చే అధికార ఫలాలను అనుభవించినప్పుడు, ఓటమితో వచ్చే కష్టాలను కూడా భరించగలిగే వాడే నిజమైన పార్టీ నాయకుడు. ప్రతి దానికి భయపడే పిరికిపందలకు బీఆరెస్ లాంటి ఉద్యమ పార్టీల్లో స్థానం ఉండకూడదు.దేశంలోను , రాష్ట్రంలోనూ అధికార పార్టీలు పోలీసు కేసులను, కట్టు కథలను, ఆయుధాలుగా వాడి రాజకీయ ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయడం నేడు మన తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. దీన్ని ధైర్యంగా మనం సర్వశక్తులొడ్డి అధిగమించిన నాడే దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా క్షమించరాని నేరానికి పాల్పడితే వారి మీద తప్పకుండా చట్ట ప్రకారం చర్యతీసుకోవలసిందే. ఆ విషయంలో పోలీసు ల డ్యూటీని ఎవరూ కాదనరు.కానీ పోలీసు కేసులనే గోరంతలు కొండంతలుగా చూపించి, వాస్తవాలను వక్రీకరించి, సోషల్ మీడియా వేదికగా, అసభ్యకరమైన శీర్షికలతో(Thumbnails) రాజకీయ ప్రత్యర్థుల మీద జరుగుతున్న కుట్రపూరిత దాడులను మనం అందరం తిప్పికొట్టాల్సిందే. #BRS సైనికులకు ఒక విజ్ఞప్తి: ఈ వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులు పార్టీకి కొత్తేం కాదు. ప్రజల గుండెల్లో మనకు స్థానం పదిలంగా ఉన్నంత వరకు ఏ శక్తీ మన ప్రస్తానాన్ని ఆపలేదు. అందుకే విలువైన సమయాన్ని వృదా చేయకుండా, ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా, మనను నమ్ముకున్న ఆ ప్రజల వద్దకే వెళ్లి, వాళ్లకు వాస్తవాలను వివరించి, రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ తెలంగాణ ద్రోహుల చెంప ఛెల్లుమనేలా విజయభేరి మోగిద్దాం👊 పదండి ముందుకు.. పదండి తోసుకు.. పోదాం పోదాం పైపైకి… కదం తొక్కుతూ, పదం పాడుతూ హృదయాంతరాళం గర్జిస్తూ పదండి పోదాం పైపైకి..✊ #brs #lok-sabha-elections-2024 #rs-praveen-kumar #nagarkurnool మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి