KTR : రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

చంచల్ గూడ జైలులో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి క్రిషాంక్ తో కేటీఆర్ ఈ రోజు ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓయూలో సెలవుల విషయమై క్రిషాంక్ పెట్టిన పోస్టు ఫేక్ అని నిరూపిస్తే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమన్నారు.

New Update
KTR : రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

Manne Krishank :ఇటీవల అరెస్ట్ అయిన బీఆర్ఎస్(BRS) సోషల్ మీడియా(Social Media) ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఈ రోజు చంచల్ గూడ జైలులో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిషాంక్ బయట పెట్టిన సర్క్యులర్ తప్పైతే తాను చంచల్ గూడ జైలుకు వెళ్ళడానికి సిద్ధం అని ప్రకటించారు. రేవంత్ రెడ్డి పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని తాము రుజువు చేస్తే ఆయన జైలుకు వెళ్ళడానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు కేటీఆర్.

Also Read : మందు బాబులకు షాక్.. 48 గంటలు వైన్స్ బంద్

Advertisment
తాజా కథనాలు