Harish Rao : సంగారెడ్డిలో అగ్ని ప్రమాదానికి కారణం అదే.. హరీశ్ రావు సంచలన ఆరోపణలు అధికారులు ఏడాదికొకసారి రియాక్టర్లను తనిఖీ చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలో తరచూ రియాక్టర్లు పేలుతుండడంతో చాలామంది చనిపోతున్నారన్నారు. అయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. By Nikhil 04 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Sangareddy : సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లోని ఎస్బీ ఆర్గానిక్స్(SB Organics) పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఎంఎన్ఆర్ ఆస్పత్రి(MNR Hospital) లో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం ఘోరంగా విఫలమమయ్యాయని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో తరచూ రియాక్టర్లు పేలుతుండడంతో చాలామంది చనిపోతున్నారన్నారు. అయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఏడాదికొకసారి రియాక్టర్లను తనిఖీ చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. క్షతగాత్రులు ఏఏ ఆస్పత్రుల్లో ఉన్నారో స్పష్టత లేదన్నారు. ఇది కూడా చదవండి: Sangareddy Blast: భారీ పేలుడు.. ఏడుగురు మృతి ఎంతమంది చనిపోయారో, ఎంతమంది గాయపడ్డారో కూడా స్పష్టత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల బాగోగులు ఎవరు చూస్తున్నారో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు వచ్చి లాంఛనంగా పరామర్శించడం కాదు.. చిత్తశుద్ధితో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి రూ.25 లక్షలు పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని బీఆర్ఎస్(BRS) తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. వైద్య ఖర్చులను ప్రభుత్వం, కంపెనీ భరించాలనన్నారు. మృతదేహాలను స్వగ్రామానికి పంపడానికి అంబులెన్సులు సమకూర్చి సాయం చేయాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించడం, పోలీసులు లాఠీ ఛార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దుఃఖంలో ఉన్నావారికి అండగా నిలబడి ఆదుకోవాలి తప్ప ఇలా వేధించడం సరికాదన్నారు. తెలంగాణ(Telangana) కు చెందిన బాధితులకు బీఆర్ఎస్ తరఫున సాయం అందిస్తామని ప్రకటించారు. భవిష్యత్ లో ఇలాంటి విషాదాలు జరగకుండా, రియాక్టర్లు పేలకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. #brs #sangareddy #harish-rao #sb-organics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి