KTR : తెలంగాణలో మేము గెలిచే సీట్లు ఇవే.. లెక్కలతో సహా వెల్లడించిన కేటీఆర్!

ఏపీలో జగన్ విజయం, తెలంగాణలో బీఆర్ఎస్ కు అత్యధిక ఎంపీ సీట్లు రాబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నల్గొండలో ఒక్కసీటుకే పరిమితమవుతుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు లాభం జరిగే అవకాశం ఉందన్నారు.

KTR : తెలంగాణలో మేము గెలిచే సీట్లు ఇవే.. లెక్కలతో సహా వెల్లడించిన కేటీఆర్!
New Update

Telangana : బీఆర్ఎస్(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్(KTR) తెలంగాణలో తమ పార్టీకే మెజారిటీ సీట్లు రాబోతున్నట్లు తెలిపాడు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ(AP)లో జగన్‌(CM Jagan) గెలుస్తున్నాడని తమకు సమాచారం ఉందన్నాడు. తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో(MP Elections) సైలెంట్ ఓటింగ్ జరిగిందని, బీఆర్ఎస్‌కు అధిక ఓట్లు పడ్డట్లు సర్వే ఆధారంగా చెబుతున్నానన్నాడు. అలాగే కాంగ్రెస్‌ ఒక్క నల్గొండ సీటు మాత్రమే గెలుస్తుందని, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు సరిగ్గా లేరన్నారు.

ఈ మేరకు నాగర్ కర్నూలు, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్‌, చేవెళ్లలో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో BJP Vs BRS పోటీపడుతున్నాయన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు లాభం జరిగే అవకాశం ఉందని చెప్పారు. సునీతా మహేందర్ రెడ్డికి మల్కాజిగిరికి సంబంధం ఏమిటని, బండి సంజయ్‌ని గెలిపించాలని అడ్రస్‌ లేని వెలిచాలకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చారన్నారు. ఇక నాగర్‌కర్నూలు మా అభ్యర్థి ఆర్ఎస్పీతో ఇద్దరు అభ్యర్థులు సరితూగలేరని, ప్రవీణ్ ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నాగర్‌కర్నూలు సమీకరణాలు మారాయయన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉందని తాను అనుకోవడం లేదన్నారు.

Also Read : ఢిల్లీకి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

#brs #ktr #2024-elections #ap-cm-ys-jagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe