కోహ్లీ సెంచరీ లాగే బీఆర్ఎస్ కూడా 100 సీట్లు గెలుస్తుంది.. కేటీఆర్ ధీమా!

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ వేములవాడలో పర్యటించారు మంత్రి కేటీఆర్. ఈ పర్యటనలో వేములవాడను దత్తత తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. కోహ్లీ సెంచరీ చేసినట్లే BRS పార్టీ కూడా 100 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Hyderabad: హైదరాబాద్‌లో 24 గంటల నీటి సరఫరా.. స్పెషల్ ఫోకస్ పెట్టిన మంత్రి కేటీఆర్..
New Update

KTR Meeting in Vemulawada : ఈ ఎన్నికల్లో BRS ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు వరుస జిల్లాల పర్యటనతో మంత్రి కేటీఆర్(KTR) బిజీగా గడుపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ వేములవాడలో పర్యటించారు మంత్రి కేటీఆర్. ఈ పర్యటనలో కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లపై తిట్ల వర్షం కురిపించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్(CM KCR)ను ఓడించేందుకు అన్నీ ప్రధాన పార్టీలు ఒక్కటైయ్యాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ సింహంలాంటోడని.. సింగల్ గానే ఎన్నికల్లో విజయం సాధిస్తారని అన్నారు. తెలంగాణ ప్రజల అండ కేసీఆర్ కు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.

Also Read: విజయశాంతికి షాక్ ఇచ్చిన బీజేపీ.. స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇదే!

వేములవాడ పర్యటనలో అక్కడి ప్రజలపై హామీల వర్షం కురిపించారు మంత్రి కేటీఆర్. ఈ ఎన్నికల్లో BRS పార్టీని గెలిపిస్తే వేములవాడను దత్తతకు తీసుకుంటానని తెలిపారు. 50 ఏండ్లు భారత దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి సీఎం కేసీఆర్ ఒక్కడే 10ఏండ్లలో చేసి.. తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా చేశారని అన్నారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. కేసీఆర్ అంటే భరోసా అని కొనియాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఎటు చూసిన పచ్చని పంటలు, పొలాలకు సాగు నీరు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, రైతులకు 24గంటల ఉచిత కరెంటు, రైతుబంధు (RYTHU BANDHU) ద్వారా పెట్టుబడి సాయం ఇలా తెలంగాణ ప్రజలకు కడుపునిండా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని అన్నారు.

Also Read: సీఎం కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది.. ఈ ఎన్నికల్లో బీజేపీని లేదా కాంగ్రెస్ ను గెలిపించి తెలంగాణను వారి చేతిలో పెడితే రాష్ట్రం ఆగమైపోతాదని హెచ్చరించారు. కోహ్లీ (Virat Kohli) సెంచరీ చేసినట్టు ఈ ఎన్నికల్లో BRS కూడా 100 సీట్లను కైవసం చేసుకొని అధికారంలో వచ్చి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

#telangana-election-2023 #ktr #cm-kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe