BRS Focus on Malkajgiri: ఎట్టకేలకు ఊగిసలాటకు తెరపడింది.. ముందునుంచీ అనుకుంటున్నట్లుగానే ఆయన పార్టీని వీడారు.. తన రాజీనామా లేఖను గులాబీ బాస్‌కు పంపించారు. ఆయనెవరో కాదు.. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. తన కొడుక్కి ఎమ్మెల్యే సీటు కోసం బీఆర్ఎస్‌ను వీడిన ఆయన.. రేపో మాపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేదే ఆసక్తికరంగా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు పేరును ఖరారు చేశారు. అయితే, తన కొడుక్కి మెదక్ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలంటూ ఆయన కోరగా.. అధినేత అంగీకరించలేదు. దాంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న మైనంపల్లి.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.
మైనంపల్లి రాజీనామాతో కొత్త అభ్యర్థిపై ఫోకస్..
అయితే, మైనంపల్లి హనుమంతరావు పార్టీకి రాజీనామా చేయడంతో మల్కాజిగిరి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ అధిష్టానం. అయితే, దాదాపు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికే ఈ సీటు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ప్రచారంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిథి క్రిశాంక్, మండలి రాధాకృష్ణా యాదవ్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. రాధాకృష్ణ యాదవ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీప బంధువు. దాంతో ఆయనకు టికెట్ కేటాయించడంపైనా చర్చ జరుగుతోంది. ఈయన గతంలో టీడీపీలో చాలా కాలం పని చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థిని లాగే ప్లాన్..
ఇదే సమయంలో మల్కాజిగిరి కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న నందికంటి శ్రీధర్‌ను తమవైపు లాగేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ప్రస్తుతం మల్కాజిగిరి ఇన్‌ఛార్జి గా ఉన్న శ్రీధర్.. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, మైనంపల్లి రాకతో ఆయనకు టికెట్ దక్కడం దాదాపు అసాధ్యమే చెప్పాలి. అందుకే.. శ్రీధర్ అసంతృప్తిని ఆసరాగా చేసుకుని తమవైపు లాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ.
అధినేత హామీలు..
బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లిని సద్దుమణిచేందుకు పార్టీ అధినేత అసంతృప్త నేతలకు హామీలు ఇస్తున్నారు. మల్లారెడ్డి అల్లు రాజశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. జనగామ ఎమ్మెల్యే టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ స్థానంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తామని అధినేత హామీ ఇచ్చారట. ఇక స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని హామీ ఇచ్చారట.
Also Read:
Chandrababu Arrest: చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోంది.. నారా లోకేష్ సంచలన ఆరోపణలు..