/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/boinapally-vinod-kumar-.jpg)
Vinod Kumar: విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వాలని అన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణకు కూడా ఇవ్వాల్సినవి తప్పక ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి విభజన చట్టంలోనే ఉందని అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.60 వేల కోట్లు ఇస్తే సంతోషమే అని చెప్పారు. కేంద్రంలో చంద్రబాబుపై ఆధారపడ్డారు కాబట్టి ఏపీకి మాత్రమే ఇస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలని చెప్పారు.
LIVE | Ex MP @vinodboianpalli Press Meet at Telangana Bhavan https://t.co/c4yOtnfeli
— BRS Party (@BRSparty) July 13, 2024