BRS Ex-MLA Balka Suman: బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆచూకీ కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా ఆయన పరారీలో ఉన్నారు. రెండ్రోజులుగా బాల్క సుమన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) ధూషించిన వ్యవహారంలో మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో (Mancherial Police Station) బాల్క సుమన్ పై కేసు నమోదు అయింది. ఆయనపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
అసలేమైందంటే..
మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో బాల్క సుమన్‌పై కేసు నమోదైంది. సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ (Congress) నేతలు. 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసభ్యపదజాలం వాడడం, బెదిరింపులకు దిగడంలాంటి సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. నేర పూరిత బెదిరింపులకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ సుమన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్‌కు చెప్పు చూపించి తిట్టారు బాల్క సుమన్.
బాల్క సుమన్ ఏం అన్నారంటే?
రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ జోలికొస్తే చెప్పుతో కొడతా అని పరుషపదజాలాన్ని ఉపయోగించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినా కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్షమించి వదిలేసామన్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే రేవంత్ రెడ్డి అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
ఆరు గ్యారెంటీలో ఒక్కటి కూడా:
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలో (Congress Guarantees) ఒక గ్యారెంటీని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శలు గుప్పించారు. డిసెంబర్ 9న చేస్తామన్న రుణమాఫీ, రూ. 4 వేల పెన్షన్, 5 వందల రూపాయల గ్యాస్, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు పరిపాలన గాలికి వదిలేసి ఆస్తులు సంపాధించుకునే పనిలో పడ్డారని దుయ్యబట్టారు.