రేపు దుబ్బాక బంద్‎కు బీఆర్ఎస్ పిలుపు.. రేవంత్, రఘునందన్ సంచలన రియాక్షన్!

కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడికి నిరసనగా రేపు ( మంగళవారం) దుబ్బాక నియోజకవర్గ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని..బంద్ ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ కోరింది. ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త రాజు అనే వ్యక్తి కత్తితో దాడిని చేసిన సంగతి తెలిసిందే.

New Update
BREAKING: రఘునందన్ రావు ఓటమి.. కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు

కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడికి నిరసనగా రేపు ( మంగళవారం) దుబ్బాక నియోజకవర్గ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని..బంద్ ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ కోరింది. ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త రాజు అనే వ్యక్తి కత్తితో దాడిని చేసిన సంగతి తెలిసిందే. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి పై హత్యాయత్నం చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. కాగా దౌల్తాబాద్ మండలం సురంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై చెప్యాల గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

కాగా కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి బాధాకరం, దురదృష్టకరమన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఏ పార్టీ వాళ్ళైనా ప్రజాస్వామ్యంలో స్వచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చన్నారు. ప్రభాకర్ మీద దాడిని ఖండిస్తున్నామన్న రఘునందన్ రావు ..దుబ్బాకలో ఘర్షణలకు తావు లేదన్నారు. దాడి చేసిన వ్యక్తి రాజు.. కాంగ్రెస్ కార్యకర్త అని తెలిసిందన్నారు. జరిగిన దాడికి రఘునందన్ కి ఎలాంటి సంబంధం లేదన్న ఆయన..దుబ్బాక బీజేపీ కార్యకర్తలు తప్పు చేయరన్నారు. సిపి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మీడియాకు వివరించాలన్నారు.

గతంలో దుబ్బాకలో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. దుబ్బాకలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కార్యకర్తల మీద భౌతిక దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీపీ నన్ను టార్గెట్ చేసి పార్టీని టార్గెట్ చేసి ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ దాడికి సంబంధం లేకపోయినా ఎందుకు లాగుతున్నారో సిపి నిరూపించాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందనే భయంతో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రఘునందన్ రావు అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న ఆయన దాడిని కండిస్తున్నా అన్నారు. హాస్పిటల్ కి వెళ్లి కొత్త ప్రభాకర్ రెడ్డి ని పరామర్శిస్తానని రఘునందన్ రావు తెలిపారు.

మరోవైపు దుబ్బాకలో ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి నెపం కాంగ్రెస్ పై నెట్టాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మొండి కత్తితో దాడి చేసింది కాంగ్రెస్ వ్యక్తి అని కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. దాడి ఘటనను కాంగ్రెస్ ఖాతాలో వేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి బీజేపీకి చెందిన వ్యక్తి అని..కేసీఆర్ కు నేను సవాల్ చేస్తున్నా... చేతనైతే నిరూపించాలన్నారు. కాంగ్రెస్ సిద్దాంతం అహింస అని అన్న రేవంత్ రెడ్డి...కాంగ్రెస్ ఎప్పుడూ హింసకు పాల్పడదన్నారు. కాంగ్రెస్ ను ఓడించాలని బీజేపీ, బీఆరెస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

అటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి సర్జరీ విజయవంతం అయ్యిందని యశోద వైద్యులు తెలిపారు. చిన్న ప్రేగుకు 4 చోట్ల గాయాలు... 15 సెంటిమిటర్లపై కడుపును కట్ 10 సెంటిమిటర్లు చిన్న ప్రేగును తొలగించినట్లు వైద్యులు తెలిపారు. గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు తరిలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదన్నారు. రక్తం అంత కూడా కడుపులో పేరుకుపోయిందని.. అందుకే 15 సెంటిమిటర్లు కట్ చేసి పేరుకుపోయిన రక్తం అంత క్లీన్ చేశామని తెలిపారు. లోపల రక్తం పెరుకుపోవడం, ప్రేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఇంత ఆలస్యం అయ్యిందని యశోద వైద్యులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‎కు ఈడీ నోటీసులు ..నవంబర్ 2న విచారణకు రావాలని నోటీస్..!!

Advertisment
తాజా కథనాలు