Movierulz, iBOMMA లో సినిమాలు చూస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త! సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. Movierulz, iBOMMA వెబ్ సైట్స్ లో సినిమాలు చూస్తున్న వారే టార్గెట్ సైబర్ దాడులు చేస్తున్నారు. వారి వ్యక్తిగత డేటా, డబ్బు కాజేస్తున్నారు. ఇలాంటి వెబ్ సైట్స్ కు ప్రజలు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. By V.J Reddy 12 Dec 2023 in సినిమా క్రైం New Update షేర్ చేయండి ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తరువాత సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. పేద, పెద్ద అనే తేడా లేకుండా అందరి దగ్గర నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్ల చేతిలో పడి మోసపోతున్న వారి సంఖ్య గణినీయంగా పెరుగుతుంది. చదువుకొని వారు, చదువుకున్న వారు కూడా లిస్టులో ఉన్నారు. ALSO READ: ఊహలకందని ముఖ్యమంత్రుల ఎంపిక.. బీజేపీ గేమ్ ప్లాన్ అదిరింది అతి తక్కువ ధరకే పొందాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.. మీ అకౌంట్లో కోటి రూపాయలు జమ అయ్యాయి చెక్ చేసుకోండి.. ఇలా కొన్ని ఫేక్ లింకులు పంపి ప్రజల నుంచి వారికి తెలియకుండానే వారి ఖాతాలో నుంచి సొమ్మును కాజేస్తున్నారు. మరి ఇన్ని విధాలుగా మోసాలు జరుగుతుంటే దీనిపై ప్రజలకు అవగాహనా ఉండదా? అని అంటే.. ఉంటుంది కానీ, వారి అత్యాశ కారణంగా తెలిసి కూడా ఇలాంటి మోసాలకు బలిఅవుతున్నారని సైబరాబాద్ పోలీసులు తెలుపుతున్నారు. డబ్బు ఒకటే కాదు వారి యొక్క వ్యక్తిగత డేటా కూడా చోరీ చేస్తున్నారు ఈ కేటుగాళ్లు. ప్రస్తుత గ్లోబల్ మార్కెట్ లో వ్యక్తి గత డేటాకు భారీగా డిమాండ్ ఉంది.. ఈ క్రమంలో కొన్ని మార్కెటింగ్ సంస్థలకు ఈ హ్యాకర్లు ఇతరుల వ్యక్తి గత డేటా అమ్మి డబ్బు జమ చేసుకుంటున్నారు. ఈ సైబర్ నేరగాళ్లకు చెక్ పెడుతామని పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసిన వారు కొత్త మార్గాలు ఎంచుకుంటూ ప్రజలకు టోపీ పెడుతున్నారు. పోలీసులకు కూడా సైబర్ నేరగాళ్లతో పెద్ద తలపునొప్పే అనే చెప్పాలి. తాజాగా సైబర్ నేరగాళ్లు కొత్త మార్గంలో సామాన్యుల ఖజానాను కాజేసేందుకు సిద్ధమయ్యారను. ప్రస్తుత కాలంలో సినిమా టికెట్ల ధరలు పెరగడం, ఓటిటి సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు పెరగడంతో అందరు ఉచితంగా కొత్త సినిమాలు చూడొచ్చని ఐబొమ్మ, మూవీరూల్స్ వంటి వెబ్ సైట్స్ లో ప్రజలు సినిమాలు డౌన్లోడ్ చేసుకొని మరీ చూస్తున్నారు. అయితే, వారు సినిమాలే కాదు ఒక హ్యాక్ చేసే మాల్వేర్ సాఫ్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారని తెలియదు. సైబర్ నేరగాళ్లకు సినిమా డౌన్లోడ్ చేసుకునే సమయంలో వారి డేటాను చోరీ చేస్తున్నారు. సినిమా డౌన్ లోడ్ చేసుకోవాలని డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేయగానే అది వేరే వెబ్ సైట్ కి రీడైరెక్ట్ అవుతోంది.. ఆ సమయంలో మనకు తెలియకుండానే ఏవోవో యాడ్స్ రావడం.. క్లిక్ టూ డౌన్ లోడ్ అంటూ ఫోన్ బ్రౌసర్ లో కొత్త టాబ్స్ ఓపెన్ అవుతాయి. అలా ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మనం మన వ్యక్తి గత సమాచారాన్ని తెలుసుకునేందుకు సైబర్ నేరగాళ్లకు అనుమతినిచ్చినట్లే. ఈ విధంగా సైబర్ కేటుగాళ్లు ప్రజల సొమ్మును ఈజీగా దోచేస్తున్నారు. తమ ఫోన్లో నుంచి డబ్బులు పొయాయ్యి, తమ ఫోన్లు హ్యాకింగ్ కు గురి అయ్యాయని కొందరు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఫ్రీగా సినిమా చూడొచ్చు అని ఇలాంటి వెబ్ సైట్స్ వాడితే మీ వ్యక్తిగత డేటాతో పాటు డబ్బు కూడా హ్యాకర్లు కాజేస్తారని.. ఇలాంటి వెబ్ సైట్స్ కు దూరంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. ALSO READ: హైదరాబాద్ తో పాటు ముగ్గురు సీపీలు ఔట్.. లా అండ్ ఆర్డర్‌లో రేవంత్ మార్క్! #telugu-latest-news #hackers #ibomma #movierulz మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి