Rakhi: అక్కలతో రాఖీ కట్టించుకోవడానికి తండ్రి భుజాలనెక్కి! మంచిర్యాల జిల్లాలో జితేంద్ర అనే బాలుడు రామకృష్ణాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు తన సోదరిమణులతో రాఖీలు కట్టించుకునేందుకు వెళ్లగా పాఠశాల సిబ్బంది అనుమతించలేదు. దీంతో తండ్రి భుజాలపైకి ఎక్కి కిటికీలో నుంచి తన అక్కలతో రాఖీ కట్టించుకున్నాడు. By Bhavana 20 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rakhi: రాఖీ పండుగను అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెల్లు ఎంతో వేడుకగా జరుపుకునే సంబంరం. ఒకరికి ఒకరు తోడుగా...రక్షగా ఉండాలని ఈ రక్షాబంధనాన్ని నిర్వహించుకుంటారు. తన అక్కాచెల్లెళ్ల తో రాఖీ కట్టించుకునేందుకు వెళ్లిన ఓ బాలుడ్ని పాఠశాల యజామాన్యం లోపలికి అనుమతించకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. మంచిర్యాల జిల్లాలో జితేంద్ర అనే బాలుడు రామకృష్ణాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు తన సోదరిమణులతో రాఖీలు కట్టించుకునేందుకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు వెళ్లాడు. కానీ అక్కడ బాలుడు జితేంద్రను గురుకుల సిబ్బంది ఆ బాబును లోపలికి అనుమతించలేదు. రాఖీ కట్టించుకోవడానికి గురుకులంలోకి లోపలికి అనుమతించని సిబ్బంది.. తండ్రి భుజం ఎక్కి అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు మంచిర్యాల - రామక్రిష్ణపూర్ సోషల్ వేల్పేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న అక్కలు దాసరి అశ్విక, సహస్రతో రాఖీ కట్టించుకోవడానికి వెళ్లిన తమ్ముడు జితేంద్రను పాఠశాల… pic.twitter.com/UohNR1VoAo — Telugu Scribe (@TeluguScribe) August 19, 2024 దీంతో చేసేదేమీ లేక.. జితేంద్ర తన తండ్రి భుజాలపైకి ఎక్కాడు. తన అక్కలు దాసరి అశ్విక, సహస్ర.. హాస్టల్ గది కిటికీలో నుంచే తమ తమ్ముడు జితేంద్రకు రాఖీ కట్టి స్వీటు తినిపించారు. మొత్తానికి అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని ఈ విధంగా చాటాడు జితేంద్ర. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. Also Read: రాష్ట్రంలో నాలుగు రోజులు వానలే..వానలు! #school #brother #manchiryal #rakhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి