International: షిప్ మునక..బ్రిటన్ వ్యాపారవేత్త గల్లంతు

షిప్ మునిగిపోవడంతో అందులో ఉన్న బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త మైక్ లించ్ సహా ఏడుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన సిసిలీలో జరిగింది. ఏడుగురిలో ఇద్దరు బ్రిటిషర్లు, ఇద్దరు అమెరికన్లు, ఒక కెనెడియన్ ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
International: షిప్ మునక..బ్రిటన్ వ్యాపారవేత్త గల్లంతు

Mike Lynch missing : ఇటలీ తీరంలో విషాదం చోటు చేసుకుంది. తీవ్ర తుఫాను కారణంగా సిసిలీలో ఓ క్రూజ్ షిప్ మునిగిపోయింది. మనుషులతో ఉన్న ఓడ మునిగిపోవడంతో ఇందులో ఉన్నవారు గల్లంతయ్యారు. బ్రిటన్‌కు చెందిన బడా బిజినెస్ మాగ్నెట్ మైక్ లించ్ కూడా ఇందులో ఉన్నారు.బ్రిటన్‌కు చెందిన 59 ఏళ్ళ మైక్‌ లించ్‌ టెక్‌ దిగ్గజ సంస్థ అటానమీ కార్పొరేషన్‌ను 1990ల్లో స్థాపించాడు. ఈయనతో పాటూ ద్దరు బ్రిటిషర్లు, ఇద్దరు అమెరికన్లు, ఒక కెనెడియన్ ఉన్నారని...వారు కూడా గల్లంతయ్యారని వార్తలు వస్తున్నాయి. వీరిలో ఒకరి మృతదేహం దొరికింది. అది ఎవరిది అన్నది ఇంకా గుర్తుపట్టాల్సి ఉంది.

మరోవైపు ఓడ ప్రమాదంలో మైక్ లించ్ భార్య మరో 14మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం గల్లంతయిన వారికోసం రెస్క్యూ చేపట్టారు. నౌకను బయటకు తీయడంతో పాటూ అందులో ఉన్నవారి జాడను కూడా కనిపెట్టేపనిలో ఉన్నారు. సిసిలియన్ పోర్ట్ నుంచి ఈ యాట్చ్ ఆగస్టు 14న బయలుదేరింది. మొత్తం ఇందులో 10మంది సిబ్బంది, 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది మునిగిపోయినట్లు తెలుస్తోంది.

Also Read: Jobs: పోస్టల్ ఉద్యోగాల షార్ట్ లిస్ట్ అభ్యర్ధుల జాబితా విడుదల

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు