Tom Wilkinson : సినీ పరిశ్రమలో విషాదం.. 'బ్యాట్‌మ్యాన్' ఇకలేరు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బ్రిటిష్ నటుడు టామ్ విల్కిన్సన్ (75) అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 'బ్యాట్‌మ్యాన్' సినిమాతో భారీ పాపులారిటీ పొందిన ఆయన రెండుసార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు. By srinivas 31 Dec 2023 in సినిమా క్రైం New Update షేర్ చేయండి Tom Wilkinson : సినీ పరిశ్రమను మరో విషాదం కలిచివేసింది. ఇటీవలే విజయ్ కాంగ్ మరణం నుంచి పూర్తి కోలుకోకముందే ప్రముఖ బ్రిటిష్ నటుడు టామ్ విల్కిన్సన్ (Tom Wilkinson) ఆదివారం ఉదయం కన్నుమూశారు. 'బ్యాట్‌మ్యాన్' (Batman) సినిమాతో భారీ పాపులారిటీ పొందిన ఆయన విల్కిన్సన్ రెండుసార్లు ఆస్కార్ (Oscar) అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. ఆయన మరణం సినీ అభిమానులతోపాటు ఇండస్ట్రీలోనూ విషాదం నిపింది. ప్రస్తుతం 75 ఏళ్ల వయసున్న విల్కిన్సన్ అనారోగ్యంతో మృతి చెందినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియా, ఇతర వేదికల ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1976 వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ 'స్ముకా' (Smuka) అనే సినిమాతో టామ్ విల్కిన్సన్ హాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. తన 50 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 130కి పైగా సినిమాల్లో నటించాడు. 'ది ఫుల్ మాంటీ', (The Full Monty) 'మైఖేల్ క్లేటన్', (Michael Clayton) 'ది బెస్ట్ ఎక్సోటిక్ మేరిగోల్డ్ హోటల్' (The Best Exotic Marigold Hotel)లో తన పాత్రలకుగానూ ఆస్కార్ నామినేట్ అయ్యారు. ఇది కూడా చదవండి : Narayanamurthy : నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టిన పీపుల్ స్టార్ ఇక విల్కిన్సన్ 2001లో కుటుంబ నాటకం 'ఇన్ ది బెడ్‌రూమ్' (In the bedroom)లో తన పనికి ఉత్తమ నటుడు అకాడమీ అవార్డుకు ఎంపికయ్యాడు. జార్జ్ క్లూనీ నటించిన 2007 చిత్రం 'మైఖేల్ క్లేటన్'లో పాత్రకు ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఎంపికయ్యాడు. నాటక రంగానికి చేసిన సేవలకు 2005లో ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్‌లో సభ్యునిగా నియమితులవడం విశేషం. #passed-away #actor #british #tom-wilkinson మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి