Taapsee Pannu: పెళ్లి కూతురు తాప్సీ ఎంట్రీ అదుర్స్‌..వైరల్‌ అవుతున్న వీడియో

హీరోయిన్‌ తాప్సీ భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న మథియాస్ బోయ్‌ని మార్చి 23, 2024న వివాహం చేసుకుంది. తాజాగా వివాహానికి సంబంధించిన ఓ వీడియో లీకైంది. తాప్సీ పన్ను డ్యాన్స్‌ చేసుకుంటూ అదిరిపోయే ఎంట్రీ చూడాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.

New Update
Taapsee Pannu: పెళ్లి కూతురు తాప్సీ ఎంట్రీ అదుర్స్‌..వైరల్‌ అవుతున్న వీడియో

Taapsee Pannu Wedding Video: హీరయిన్‌ తాప్సీ పన్ను మథియాస్ బోయ్‌ని (Mathias Boe) మార్చి 23, 2024న వివాహం చేసుకుంది. అయితే పెళ్లి వేడుకను ప్రైవేట్‌గా జరుపుకున్నారు. వివాహానికి సంబంధించిన ఒక్క ఫొటో, వీడియో కూడా ఇంత వరకు బయటికి రాలేదు. అయితే తాజాగా తాప్సీ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో లీకైంది. ఈ వీడియోలో తాప్సీ పన్ను డ్యాన్స్‌ చేసుకుంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా భర్తను హగ్‌ చేసుకుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. పంజాబీ పాట తేరే నాల్ నయియోన్ బోల్నాకు డ్యాన్స్ చేస్తూ తాప్సీ స్టేజ్‌పైకి వచ్చింది.

తాప్సీ పన్ను భర్త మథియాస్ బోయ్ ఎవరు..?

43 ఏళ్ల మథియాస్‌ బోయ్ జూలై 11, 1980న జన్మించాడు. అతను డానిష్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. అతను 1988లో అంతర్జాతీయ స్థాయిలో ఆడటం ప్రారంభించాడు. 2012 ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో రజత పతకాన్ని సాధించాడు. 2015లో యూరోపియన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించాడు. చైనాలోని కున్‌షాన్‌లో జరిగిన 2016 థామస్ కప్‌లో డెన్మార్క్ విజేత జట్టులో కూడా అతను సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు.

ఇద్దరికి ఎలా పరిచయం..?

2014లో ఇండియా ఓపెన్‌లో ఆడుతున్నప్పుడు తాప్సీ పన్ను, మథియాస్ బో డేటింగ్ పుకార్లు వచ్చాయి. ఇద్దరూ కలిసి ఒకరికొకరు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సాధించిన విజయాల విషయంలో సంబరాలు చేసుకోవడం తరచూ కనిపించింది. దానికి తోడు ఫోటోలను పోస్ట్ చేయడంతో అందరూ కన్‌ఫామ్‌ చేసుకున్నారు. ఇటీవల తాప్సీ పన్ను, మథియాస్‌తో తన పదేళ్ల సంబంధం గురించి బయటపెట్టింది. తాప్సీ చివరిసారిగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన డుంకీలో షారూఖ్ సరసన నటించింది.

ఇది కూడా చదవండి: వేసవిలో ORS ప్యాకెట్‌ని దగ్గర ఉంచుకోండి..ఎందుకో తెలుసా..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#Taapsee Pannu #punjab
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు