Brezilian Swimmer: ఒలింపిక్స్‌లో పాల్గొనడం అంత ఈజీ ఏమీ కాదు. ఎన్నో ఏళ్ళు కలలు కంటే...దానికి తగ్గట్టు శ్రమిస్తే కానీ అవకాశాలు రావు. కొంతమంది ఎంత కష్టపడినా అదష్టం కలిసి రాకపోతే ఒలింపిక్స్ కు సెలెక్ట్ అవ్వలేరు. సెలెక్ట్ అయ్యాక దాన్ని వదులుకున్నారు అంటే అంత దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. అచ్చం ఇలాగే జరిగింది ఒక బ్రెజిలయన్ స్విమ్మర్ విషయంలో. తాను ఎందుకు వచ్చిందో మర్చిపోయి బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేసింది. దానికి ఫలితంగా ఒలింపిక్స్ నుంచి అవుట్ అయిపోయింది.
బ్రెజిల్‌కు చెందిన స్విమ్మర్ కరోలినా వియెరా తన బాయ్‌ఫ్రెండ్, క్రీడాకారుడు అయిన గాబ్రియేల్ శాంటోస్ తో శుక్రవారం రాత్రి బయటకు వెళ్ళింది. రాత్రంతా బయటే ఉండి..మర్నాడు ఉదయం ఒలింపిక్స్ విలేజ్‌కు వచ్చింది. దీన్ని బ్రెజిలియన్ ఒలింపిక్ కమిటీ సీరియస్ అయింది. దీంతో కరోలినాపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. బయటకు వెళ్ళిన విషయం ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చేసింది. దాని ద్వారానే ఈ విషయం బయటకు వచ్చింది. ముందస్తు అనుమతి తీసుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై కమిటీ మండిపడింది.కరోలినాను ఒలింపిక్స్ టోర్నీ నుంచి తొలగించి స్వదేశానికి పంపించింది.
అయితే ఇదే శిక్షను కరోలినా బాయ్ ఫ్రెండ్ గాబ్రియేల్ శాంటోస్‌కు కూడా విధించింది ఒలింపిక్స కమిటీ. కానీ శాంటోస్ సారీ చెప్పి బతిమాలుకోవడంతో అతనికి అవకాశం మళ్ళీ ఇచ్చింది. అయితే శనివారం జరిగిన పురుషుల 4x100 ఫ్రీస్టైల్ హీట్స్‌లో శాంటోస్ ఓడిపోయాడు. ఈ విషయంపై బ్రెజిల్ స్విమ్మింగ్ కమిటీ హెడ్ గుత్సావో ఒట్‌సుకా ప్రకటన విడుదల చేశారు. ఒలింపిక్స్‌కు వచ్చింది సెలవు తీసుకొని ఎంజాయ్ చేయడానికి కాదు. దేశం విజయం కోసం వచ్చాము. అందుకే కరోలినా మీద కంప్లైంట్ చేశామని తెలిపారు.
Also Read:Waynad: అరేబియా సముద్రం వేడెక్కింది..అందుకే వయనాడ్‌లో విలయం