/rtv/media/media_files/2025/01/25/0eeRvFwbF5cN3Ahub5hv.webp)
Wine Shops Closed
Wine Shops Closed : వీకెండ్ వచ్చిందంటే ఉద్యోగులు మద్యం, మాంసంతో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ ఆదివారం మాంసం తినాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. రేపు జనవరి 26వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు, మాంసం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. అంతేకాదు ఈరోజు రాత్రి నుంచే జంతువులను వధించడం బంద్. ఈ సందర్భంగా అన్నీ చికెన్, మటన్, చేపల మార్కెట్లు మూసి వేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా మద్యం దుకాణాలు మూత పడతాయి. ఈ రోజు రాత్రి నుంచే మద్యం షాపులు మూసివేయనున్నారు. ఇప్పటికే షాపుల ముందు బోర్డ్స్ పెట్టారు. దీంతో మద్యం ప్రియులు వైన్స్ షాపుల ముందు క్యూ కట్టారు. అలాగే బార్లు, పబ్స్ కూడా మూసివేస్తారు. దీంతో ముందుగానే మద్యం బాటిళ్లను కొనుగోలు చేసుకుని ఇంటికి తెచ్చుకుంటున్నారు.
మరోవైపు ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజులపాటు వరుసగా మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు, ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8 సందర్భంగా ఆరోజు కూడా మద్యం విక్రయాలు బంద్ ఉండనున్నాయి. ప్రతి జనవరి 26, ఆగష్టు 15, అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు బంద్ ఉంటాయి. అంతేకాదు మరిన్ని ప్రత్యేక రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ ఉంటాయి. అయితే, ఎన్నికల సమయంలో కూడా ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తగా ఎన్నికల సంఘం ప్రతి ఎన్నికల రోజు, ఫలితాలు రోజు మద్యం దుకాణాలు బంద్ చేయిస్తాయి.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలో మద్యం షాపులు బంద్ కానున్నాయి. మద్యం షాపులతో పాటు మటన్, చికెన్ షాపులు కూడా మూసివేయాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆదేశాలు వర్తిస్తాయని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.