Breaking: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం ఉదయం విడుదల అయ్యింది. ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నాలుగో విడతలో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగునున్నట్లు అధికారులు వివరించారు.

Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ జాతర..ఇవాళ్టి నుంచే నమోదు
New Update

Election Commission: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం ఉదయం విడుదల అయ్యింది. నాలుగో విడత పోలింగ్‌ కోసం నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది.

ఈ నాలుగో విడతలో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగునున్నట్లు అధికారులు వివరించారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు.

నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంటుంది. వచ్చే నెల 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 10 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. తెలంగాణలో ఎంపీ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ కి ఉపఎన్నిక జరగనుంది.

Also read: టైమ్స్‌ ప్రభావంతమైన భారతీయుల్లో చోటు దక్కించుకున్న ఆలియా..ఆమెతో పాటు!

#telangana #ap #elections #notifications
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe