Viral Video: ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో

ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్‌ టోర్నీలో తీవ్ర విషాదం నెలకొంది. టోర్నీలో భాగంగా బరిలోకి దిగిన చైనీస్‌ ఆటగాడు జాంగ్‌ జిజీ (17) తన ప్రత్యర్థితో హోరాహోరీ తలపడుతున్న సమయంలో ఒక్కసారిగా కోర్టులోనే కుప్పకూలిపోయాడు.

New Update
Viral Video: ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో

Breaking: ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్‌ టోర్నీలో తీవ్ర విషాదం నెలకొంది. టోర్నీలో భాగంగా బరిలోకి దిగిన చైనీస్‌ ఆటగాడు జాంగ్‌ జిజీ (17) తన ప్రత్యర్థితో హోరాహోరీ తలపడుతున్న సమయంలో ఒక్కసారిగా కోర్టులోనే కుప్పకూలిపోయాడు.

అలా చాలా సేపు కోర్టులోనే గిలగిల కొట్టుకున్నాడు. అతనిని పరిశీలించిన అక్కడే ఉన్న ఫిజియోలు అతను గుండెపోటుకు గురైనట్లు గుర్తించారు. అయితే జాంగ్‌ కింద పడిన వెంటనే అక్కడున్న వారు ఎవరూ కూడా సకాలంలో స్పందించలేదు.

దీంతో జాంగ్‌ చాలా సేపు అలానే కోర్టులో ఉండిపోయాడు. జాంగ్‌ మరణానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. దానిని చూసిన వారంతా చావుకి వయసుతో సంబంధం లేదని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు చిన్న వయసులోనే ఓ గొప్ప ఆటగాడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేస్తున్నారు.

publive-image

Also read: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది చిన్నారులకు గాయాలు..!

Advertisment
తాజా కథనాలు