Kavitha : కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పిన బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవితకు నిరాశే ఎదురైంది. బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న ఆమె తీహార్ జైలు(Tihar Jail) కు వెళ్ళక తప్పలేదు. నిన్న ట్రయల్ కోర్టు రిమాండ్ విధించాక ఆమెను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. అక్కడ కవితకు ఖైదీ నంబర్ 666(Khaidi No 666) ను కేటాయించారు జైలు అధికారులు. వచ్చే నెల 9వ తేదీ వరకు ఇదే జైల్లో కవిత ఉండనున్నారు. అయితే మొదటిరోజు ఆమె చాలా డల్‌గా ఉన్నారని అంటున్నరు అధికారులు. ఆమెకు ఇంటి నుంచే భోజనం, బ్లాంకెట్లు లాంటి సదుపాయాలు కల్పించారు. కానీ కవిత మాత్రం సరిగ్గా తినలేదని, నిద్రపోలేదని తెలిపారు.
జైల్లో కవితకు పుస్తకాలు, పెన్నులు లాంటి సదుపాయాలు కూడా కల్పించారు. అయితే వాటి మీద కూడా దృష్టిని పెట్టలేకపోయారని అంటున్నారు జైలు అధికారులు. పుస్తకాలు కాసేపు చదివారు కానీ మళ్ళీ వాటిని పక్కన పడేసి ఆలోచనల్లోకి వెళ్ళిపోయారని చెప్పారు. ఇక ఈరోజు ఉదయం కూడా కవిత డల్‌గా కనిపించారు. బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినలేదని తెలిపారు. మొత్తానికి కవిత తొలిరోజు తీహార్ జైలులో అన్యమనస్కంగానే గడిపారని తెలుస్తోంది. ఆమె వద్దకు వచ్చిన జైలు సిబ్బందిని కూడా పలుకరించలేదని చెబుతున్నారు.
ఇక తీహార్ జైల్లో కవితకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇంటి నుంచి వచ్చే భోజనంతో పాటు అవసరమైన మందుుల, పెన్ను, పుస్తకాలు, పేపర్స్, బెడ్‌షీట్, బ్లాంకెట్ వంటివి వాడుకునేందుకు అనుమతించింది. వీటితో పాటూ ఆమెకు హైబీపీ ఉండటంతో మెడిసిన్‌కు కూడా అనుమతిని ఇచ్చారు. అదే కాకుండా ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా పెట్టుకునేందుకు కూడా అనుమతి దొరికింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) కు రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ తొమ్మిది వరకు కోర్టు రిమాండ్ ఇచ్చింది. దాంతో పాటూ ఆమెను జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటూ ట్రయల్ కోర్టు ఆమె మధ్యంతర బెయిల్ కేసును వాయిదా వేసింది. దీనిని ఏప్రిల్ 1కు వాయిదా వేసింది కోర్టు. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని…దాని కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు.
Also Read : Stock Markets : లాభాల్లో స్టాక్ మార్కెట్లు..పెరిగిన రిలయన్స్ షేర్లు